క‌రోనా కేసులు పూర్తిగా త‌గ్గిపోయాయి. చాలా జిల్లాల్లో జీరో కేసులు న‌మోద‌వుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు అడ‌పాద‌డ‌పా కేసులు వ‌స్తూ రావ‌డంతో ప్ర‌జ‌ల్లో భ‌యం వెంటాడింది. అది రెండో వేవా? కొత్త కేసులా? మూడో వేవ్ ఇక వ‌చ్చిన‌ట్టేనా? అని ఏవేవో అనుమానాలు, స‌మాధానాల్లేని ప్ర‌శ్న‌ల‌తో జ‌నం తిక‌మ‌క‌ప‌డ్డారు. కానీ మూడో వేవ్ ఇంకా రాలేదు. రెండో వేవ్ పూర్తిగా త‌గ్గిపోయింది. చాలా జిల్లాల్లో నిన్న జీరో కేసులు న‌మోద‌య్యాయి. హైద‌రాబాద్‌లో మాత్రం ఈ కేసుల సంఖ్య వేల నుంచి వంద‌ల్లోకి ప‌డిపోయింది. అయితే ఈ చైన్ పూర్తిగా తెగిపోయేది కాద‌ని వైద్యులంటున్నారు. కొంత గ్యాప్ ఇచ్చి మూడోవేవ్‌గా రూపాంత‌రం చెందే అవ‌కాశాలు ఉన్నాయ‌నే ముందు జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు.

ఎలాగూ రెండో వేవ్ పూర్తిగా పోయింది.. ఇక మూడోవేవ్ వ‌స్తుందో రాదోన‌నే అనే నిర్ల‌క్ష్యంతో వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌నే సూచ‌న‌లు చేస్తున్నారు. రెఫ్లెక్ష‌న్ ఫ్యాక్ట‌ర్‌గా దీన్ని వైద్యులు అభివర్ణ‌స్తున్నారు. ఇది మ‌రింత బ‌లంగా త‌యార‌యి జనం మీద‌కు దాడి చేసుంద‌కు రూపాంతరం చెందే స‌మ‌యం ఇద‌ని చెబుతున్నారు. కానీ వ్యాక్సిన్ వేసుకోవ‌డం మూలంగా ఈ వైర‌స్ క్రిములు శ‌రీరంలో ల‌క్ష‌ల్లో పెర‌గ‌కుండా వంద‌ల‌కు మార్చితే .. ఇతురుల‌కిది సోక‌దు. దీంతో ఇది ఒక‌రి నుంచి ఒక‌రి అంటుకునే ప‌రిస్థితి చాలా త‌గ్గుతుంది. వ్యాక్సిన్ వేసుకున్న వారికి క‌రోనా సోకితే 95 శాతం ప్రాణ‌హాని ఉండ‌కుండా నివారించ‌గ‌లుతుంది.