(దండుగుల శ్రీనివాస్)
చేసిన తప్పులు దిద్దుకునే పనిలో ఉన్నాడు కేసీఆర్. తనను చూసి ఓటేస్తారు.. క్యాండిడేట్‌ను చూడరనే భ్రమలోంచి బయటపడ్డాడు. అందుకే అప్పుడు ఇచ్చిన వారికే వరుసగా మూడు సార్లు చాన్స్ ఇచ్చి ఘోరంగా దెబ్బతిన్నాడు. సిట్టింగుల అరాచకాలు అంతా ఇంతా కావు. పార్టీ క్యాడర్ ను, ఉద్యమకారులను, సీనియర్ లీడర్లను దూరం పెట్టారు. వేధించారు. రాచి రంపాన పెట్టారు. కేసులు పెట్టి జైళ్ల పాలు కూడా చేశారు. ఈ లిస్టులో ముందు వరుసలో ఉన్నది ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి. అక్షర క్రమంలో ఆర్మూర్ నియోజకవర్గం ముందు వరుసలో ఉన్నట్టు.. అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ కేసులు.. కబ్జాలు, మోసాలు.. ఇలా అన్నింటికీ న్యాయం చేసిన ఈ తాజామాజీపై ఫోకస్ పెట్టాడు కేసీఆర్.
ఇటీవల ఆ పార్టీకే చెందిన ఆర్మూర్ నేతలు ప్రెస్‌మీట్ పెట్టి మరీ జీవన్‌రెడ్డి భాగోతాలు బయటపెట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వీడియోలు తెప్పించుకుని మరీ విన్నారు కేసీఆర్, కేటీఆర్. కవిత కూడా దీనిపై ఆరా తీసింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవనే కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యేగా తనుండి.. తన తమ్ముడి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డిని ఇంచార్జిగా పెట్టుకున్న ఘనుడు జీవన్. అయినా డోంట్ కేర్ అన్నాడు అప్పట్లో.షాడో ఎమ్మెల్యేగా రాజేశ్వర్‌రెడ్డి చెలామణి అయ్యాడు. చెబితే వినకపోతే బెదిరింపులు. ప్రశ్నిస్తే కేసులు. ఇలా నడిచింది ఆ పదేళ్ల అరాచక వ్యవహారం.
ఎవరైనా వార్తలు రాస్తే నీ ఉద్యోగం ఊడబీకిస్తారోయ్ అని బెదిరింపులు. టిప్పర్ తో ఢీ… నా సంగతి తెలుసు కదా అని బాహాటంగానే బెదిరింపులు. ఇవన్నీ ఆర్మూర్‌లో కామన్ అయ్యాయి. నమ్మినవారిని తడిబట్టతో గొంతు కోసే దుర్భిద్ది జీవన్ సొంతం. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం, లిటిగేషన్ వ్యాపార వ్యవహారాల్లో ఇరికించి కోట్లలో వారిని ముంచేయడం, పనులు చేయించుకుని బిల్లులు తాను లేపుకోవడం… ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ దగ్గరకు చేరాయి. త్వరలో దీనిపై ఓ డిసిషన్ వెలువడుతుందనే ప్రచారం మాత్రం తెలంగాణ భవన్ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.
Dandugula Srinivas
SENIOR journalist
8096677451
ఆర్మూర్‌కు కొత్త ఇంచార్జిగా ఎవరిని పెడదాం…?
(వాస్తవంలో)
wait and see…