Month: January 2026

వీర తిల‌కం దిద్దినారు… ఇదే దారిలో న‌డ‌వ‌మ‌న్నారు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మోహ‌న్‌బాబు అడ‌విలో అన్న సినిమాలో ఓ పాటుంది. వీర తిల‌కం దిద్దినావు.. పోరు దారిలో న‌డ‌వ‌మ‌న్నావు.. వంద‌నాల‌మ్మా..అమ్మా వంద‌నాల‌మ్మా!! సూప‌ర్ హిట్ సాంగ్‌. ఇప్పుడు దీన్ని కొంచెం మార్చి పాడాలి రామ‌న్న‌కు. వీర తిల‌కం దిద్దినారు.. ఇదే దారిలో…

భాయ్‌సాబ్‌ను యాది చేసుకుంటున్న‌ క‌ట్ట‌ర్ బీజేపీ లీడ‌ర్లు! అర్వింద్ ఒంటెత్తుపోక‌డ‌ల‌తో బీజేపీ క‌కావిక‌లం! డ‌బ్బులున్న‌వారికి, అర్వింద్‌కు అనుకూలురుకు మాత్ర‌మే టికెట్లు.. మ‌ర్యాద ద‌క్క‌లేదు.. గౌవ‌ర‌మూ లేదు.. అంతా క‌మ‌ర్శియ‌ల్‌.. ఇందూరు బీజేపీలో ఇదో న‌యాట్రెండ్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇందూరు బీజేపీని ప‌ట్టుకుని ఇంకా వేలాడుతున్న క‌ట్ట‌ర్ బీజేపీ లీడ‌ర్లు ఇప్పుడు భాయ్‌సాబ్‌ను యాది చేసుకుంటున్నారు. భాయ్‌సాబ్ అంటే ఆ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ యెండ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ‌. తెలంగాణవాదం బ‌లంగా ఉన్న స‌మ‌యంలో నిజామాబాద్ ఉప ఎన్నిక‌లో డీఎస్‌ను…

మంత్రి ప‌ద‌వి ఇయ్య‌క‌పోతే… మ‌ద్యం మీద ప్ర‌తాప‌మా? టైంకు తెర‌వ‌క‌పోతే బెల్టు తీస్తారు

(దండుగుల శ్రీ‌నివాస్‌) మరీ ఇంత మూర్ఖ‌త్వం వ‌ద్దు భాయ్‌! నీకు మంత్రి ప‌దవి ఇయ్య‌లేద‌ని.. మ‌ద్యం బాబుల‌పై ప్ర‌తాపం చూపుతావా? వాళ్లెక్క‌డి నుంచో రాలేదు. మీ ఓట‌ర్లే. నీకు ఓటేసి నిన్ను గెలిపించిన‌వాళ్లే. మ‌ధ్యాహ్నం ఒంటిగంట త‌రువాత‌నే వైన్స్‌లు తీయ్యాలే… సాయంత్రం…

సింహం సింగిల్‌గా వ‌స్తోంది! కామ‌న్ సింబ‌ల్‌తో బ‌ల్దియా బ‌రిలోకి దిగుతున్న క‌విత‌! ఫార్వార్డ్ బ్లాక్ పార్టీతో చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. ప్ర‌క‌ట‌నే త‌రువాయి.. ఇక స‌మ‌ర‌మే మిగిలుంది..! కింగ్ మేక‌ర్‌గా నిలిచే ప్ర‌య‌త్నం.. స‌త్తా చాటేందుకు స‌రైన నిర్ణ‌యం.. సంద‌ర్భం..! క‌విత డిసిష‌న్‌పై జాగృతిలో కొత్త ఊపు.. క‌లిసి వ‌చ్చే అవ‌కాశాలతో జోష్‌లో ఉన్న యువ‌త‌, మ‌హిళ‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) సింహం సింగిల్‌గానే వ‌స్తుంది. వ‌చ్చింది. అనుకున్న‌ట్టుగానే.. వాస్త‌వం మీడియా వెల్ల‌డించిన‌ట్టుగానే ఆమె సింహం కామ‌న్ సింబ‌ల్‌తో బ‌ల్దియా బ‌రిలోకి దిగ‌నుంది. ఇది జాగృతిలో కొత్త ఊపును తెచ్చిపెట్టింది. ఆల్‌ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీతో క‌విత చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌య్యాయి.…

ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అట్ల‌నే ఉంది కేటీఆర్‌, హ‌రీశ్ తీరు! ఫోన్లు ట్యాపింగులు చేసింది మీరే.. స‌మ‌ర్థించుకున్న‌దీ మీరే! ఇప్పుడు సిట్‌ను త‌ప్పుబడుతూ.. పోలీసుల‌ను బెదిరిస్తూ..!

(దండుగుల శ్రీ‌నివాస్) ఓడిపోయినా ఇంకా బుద్ది మార‌లేదు. ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పినా ఇంకా అహం దిగ‌లేదు. అవే బెదిరింపు మాట‌లు. అహంకార పూరిత కామెంట్లు. ఐఏఎస్‌ల‌ను వ‌ద‌ల‌రు. ఐపీఎస్‌ల‌నూ విడ‌వ‌రు. అధికారంలో ఉన్న‌ప్పుడు విచ్చ‌ల‌విడిగా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డ కేసీఆర్, కేటీఆర్,…

కేఆర్ సురేశ్‌రెడ్డి… వార‌సుడొస్తున్నాడు! కొడుకును ఆర్మూర్ బ‌రి నుంచి ఎంట్రీకి తండ్రి సుముఖ‌త‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీనియ‌ర్ లీడ‌ర్‌, మాజీ స్పీక‌ర్ కేఆర్ సురేశ్‌రెడ్డి .. త‌న వార‌స‌త్వాన్ని రాజ‌కీయాల్లోకి దింపుతున్నాడు. ఆయ‌న త‌న కొడుకు అమిత్‌రెడ్డిని ఆర్మూర్ బ‌రి నుంచి దింపేందుకు .. ఇక్క‌డి నుంచి రాజ‌కీయ ఆరంగేట్రం చేపించేందుకు పావులు క‌దుపుతున్నాడు. ఇప్ప‌టికే…

ఇందూరుతో ముగిసిన హెచ్. గంగారం బంధం! పేరెన్నిక‌గ‌న్న వ‌స్త్ర వ్యాపారానికి ముగింపు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) హెచ్‌. గంగారం అంటే అంద‌రికీ గుర్తొచ్చేది నిజామాబాద్‌. నిజామాబాద్ అంటే హెచ్‌. గంగారాం… హెచ్. గంగార‌మంటే నిజామాబాద్‌… అలా ఉండేది దీని పేరు. ఆ పేరే ఓ బ్రాండ్‌. నిజామాబాద్‌తో ద‌శాబ్దాల చ‌రిత్ర దానికి. ఇక్క‌డి ఇందూరు ప్ర‌జ‌ల‌తో…

ఆఫ్ ది రికార్డ్ పేరుతో అక్రమ సంబంధాలంటగడితే …. ఇట్లనే ఉంటది మరి! తీటగాళ్లకు పోటుగాడు..సజ్జనార్! మీడియా విచ్చలవిడితనంపై విరుచుకుపడ్డ సిట్!! సోషల్ మీడియాలో ఏది బడితే అది రాస్తే ఇకపై చెల్లదు! కేటీఆర్ అధికారులను బెదిరిస్తాడు… ఆయన మీడియా బ్యాచ్ రెచ్చిపోతుంది! దారితప్పిన మీడియాను అదుపులోకి తేవాల్సిందే!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బ‌రిబాత‌ల ఊరిగే ఉన్న ఇజ్జత్ తీసుకున్న‌ది మీడియా. ఏది చేసినా చెల్లుతుంద‌నే ముసుగులో.. అక్ర‌మ‌సంబంధాల‌ను అంట‌గ‌ట్టి మ‌రీ దిగ‌జారి పాతాళానికి ప‌డిపోయింది. అందుకే ఇలా న‌డిరోడ్డులో బ‌రిబాత‌ల నిల‌బ‌డి ప‌రువు తీసుకున్న‌ది. ఇప్పుడు ఈ మీడియాకు స‌పోర్టు ద‌క్క‌లేదు.…

జిల్లాలు త‌గ్గ‌య్‌… స్వ‌రూపాలు మారుతాయ్‌! ఉన్న జిల్లాల‌ను త‌గ్గించే ఆలోచ‌న స‌ర్కార్‌కు లేదు!! దీన్ని రాజ‌కీయం చేసేందుకు రెడీ అయిన బీఆరెస్‌.. సాంకేతికంగా ఇబ్బందులు ప‌డుతున్న చోట‌.. ప్ర‌జాభీష్టం మేర‌కు మార్పులు.. మండ‌లాలు, రెవెన్యూ డివిజ‌న్ల నైస‌ర్గిక స్వ‌రూపాల‌పైనే స‌ర్కార్ న‌జ‌ర్‌..! ఉన్న జిల్లాలు అట్ల‌నే ఉంచి… అవ‌స‌ర‌మైతే మ‌రో జిల్లా పెంచినా ఆశ్చ‌ర్య‌పోన‌వస‌రం లేదు.. ఉద్యోగుల కోసం మ‌ల్టీజోన్‌ల‌లో మార్పులు అవ‌స‌రం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) సీఎం ఏం మాట్లాడినా దాన్ని నెగిటివ్ కంటెంట్‌లో ప్ర‌జెంట్ చేసి రాజ‌కీయ ల‌బ్ది కోసం బీఆరెస్ తెగ పాకులాడుతోంది. తాజాగా ఆ పార్టీకి దొరికిన అంశం జిల్లాల విభ‌జ‌న‌. రేవంత్‌రెడ్డి అన్న‌ది… జిల్లాల విభ‌జ‌న శాస్త్రీయంగా జ‌ర‌గ‌లేదు… కొన్ని…

స్టాక్ మార్కెట్లో సైబ‌ర్ దొంగ‌లు..! సైబ‌ర్ ముఠా వ‌ల‌లో జేడీ విల‌విల‌!! న‌కిలీ వెబ్‌సైట్లు, న‌కిలీ కంపెనీలు, న‌కిలీ వాట్సాప్ గ్రూపు.. కొంప‌ముంచుతున్న అతి తెలివి, అత్యాశ‌!

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) ఊరంతా శ‌కునం చెప్పిన బ‌ల్లి కుడితిలో ప‌డింద‌న్న చందాన్ని త‌ల‌పిస్తుంది… సైబ‌ర్ నేర‌గాళ్ల వ‌ల‌లో ప‌డుతున్న హై లిట‌రేట్లు, మేథావుల‌ను చూస్తుంటే. అతి తెలివి, అత్యాశ గ‌ల‌వారు సైబ‌ర్ క్రిమిన‌ల్స్ వ‌ల‌లో ప‌డి కోట్లు పోగొట్టుకుంటున్నారు.…