(దండుగుల శ్రీనివాస్)
మరీ ఇంత మూర్ఖత్వం వద్దు భాయ్! నీకు మంత్రి పదవి ఇయ్యలేదని.. మద్యం బాబులపై ప్రతాపం చూపుతావా? వాళ్లెక్కడి నుంచో రాలేదు. మీ ఓటర్లే. నీకు ఓటేసి నిన్ను గెలిపించినవాళ్లే. మధ్యాహ్నం ఒంటిగంట తరువాతనే వైన్స్‌లు తీయ్యాలే… సాయంత్రం ఆరు తరువాతే పర్మిట్ షాపులు తెరవాలే.. ఇగో గిసుంటి ముచ్చట్లు మరీ చిన్నపిల్లల చేష్టలెక్కలేవా? అక్కడ వైన్ షాపులు టైంకు తెరవకపోతే ఏమైతది? చుట్టుపక్కల ఒకటి రెండు మూడు ఉన్న బెల్టు షాపులు వందలుగా వెలుస్తాయి. యాపారం చేసుకుంటాయి. కాసులు కూడగట్టుకుంటాయి. అంతే తప్ప తాగుడు మానరు. చేతి చమురు అంతకు అంత పెరుగుతుంది.. దీని కోసం ఖర్చులు, అప్పులు పెరుగుతాయి తప్పితే ఏం లాభం లేదు. ఎందుకు మరి ఇదంతా?
సీఎం మీద కోపముంటే.. చాలా విషయాలు ఉన్నాయి జనాల పక్షాన మాట్లాడేందుకు. అవి మాట్లాడు. జనం కూడా భేష్ అంటారు. కానీ నువ్వు పోయి పోయి ఈ మందు మీద పడితే.. నిన్ను గెలిపించిన ఈ ఓటర్లే బెల్టు తీస్తారు నీ మీదనే. అవును.. ఎన్నికల్లో లిక్కర్ పంచనిదే గెలుపు సాధ్యం కానే కాదు. అది కామన్. మరి నువ్వు పంచకుండా గెలిచినవానే. మరప్పుడు వీళ్ల ఆరోగ్యాలు గుర్తుకు రాలేదా? ఏమైనా చేస్తే మీనింగు ఉండాలె. కొంచెం ప్రాక్టికల్‌గా పోవాలె. అప్పుడు పర్ఫెక్ట్ పొలిటికల్ లీడర్ అయితడు. మొత్తమే వైన్ షాపులు తీయకుండ్రి అనేవు. అదిసలే సాధ్యం కాదు. నిన్ను పిచ్చోడిని చూసినట్టు చూస్తారే తప్ప.. గొప్ప లీడర్ అని మాత్రం అనుకోరు. జనానికి కూడా ఆ లిక్కర్‌తో విడదీయరాని బంధం ఉంది. దాన్ని కూడా జర అర్థం చేసుకోవాలె. అప్పుడే కదా జనం లీడర్‌గా నిలిచేది. నిలబడేది.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
