(దండుగుల శ్రీ‌నివాస్‌)

సింహం సింగిల్‌గానే వ‌స్తుంది. వ‌చ్చింది. అనుకున్న‌ట్టుగానే.. వాస్త‌వం మీడియా వెల్ల‌డించిన‌ట్టుగానే ఆమె సింహం కామ‌న్ సింబ‌ల్‌తో బ‌ల్దియా బ‌రిలోకి దిగ‌నుంది. ఇది జాగృతిలో కొత్త ఊపును తెచ్చిపెట్టింది. ఆల్‌ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీతో క‌విత చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌య్యాయి. ఆమె ఇక ఈ పార్టీ సింబ‌ల్ సింహంతో ముందుకు రానుంది. బీసీ యువ‌త‌, మ‌హిళ‌ల‌కు ప్ర‌థ‌మ ప్రాధాన్య‌మిస్తాన‌ని ఆమె ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించి ఉన్న‌ది. దీంతో ఆ పార్టీలోని యువ‌త‌లో కొత్త ఊపు తెచ్చిపెడుతోంది. తొలిసారిగా ఒంట‌రిగా, డేర్‌గా ఆమె ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నుంది. ఇది ఒక ర‌కంగా ఆమెకు రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ట్ర‌య‌ల్ ర‌న్స్ లాంటివి.

ఆమె కూడా త‌న స్పీచ్‌ల‌లో జాగృతి లీడ‌ర్ల‌కు అదే చెబుతూ వ‌స్తోంది. ఓట‌మి, గెలుపు త‌రువాయి.. ముందు ఎన్నిక‌ల్లో ఎలా ఉండాలో.. వ్యూహాలు, టెక్నిక‌ల్ పాయింట్లు, జనం వ‌ద్ద ఓట్లు విన్న‌వించే తీరు.. వారితో మ‌స‌లుకునే ప‌ద్ద‌తులు ఇవ‌న్నీ కూడా అనుభ‌వంలోకి రావ‌డం భ‌విష్య‌త్తు రాజ‌కీయాల‌కు పునాదులు వేసేలా ఉండాయ‌ని ఆమె ఆకాంక్షిస్తోంది. ఇదే విధానంలో ఆమె ముందుకు సాగ‌నుంది. ఈ బ‌ల్దియా ఎన్నిక‌ల్లో కింగ్ కాలేక‌పోయినా.. కింగ్ మేక‌ర్ కావాల‌నేది ఆమె ఆశ‌యంగా ఉంది. దీని కోసం ఆమె చాలానే గ్రౌండ్ వ‌ర్క్ చేసింది. ఆమె పోటీలోకి దిగ‌డం… త‌మ‌కు క‌లిసి వ‌స్తుందా? త‌మ అవ‌కాశాల‌కు గండి కొడుతుందా? అని మూడు ప్ర‌ధాన పార్టీలు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయి.

Dandugula Srinivas

Senior Journalist

7661066999