(దండుగుల శ్రీనివాస్)
అనుకున్నట్టే జరుగుతున్నది. జరిగింది. ముందే మనోళ్లు మంచి కాకమీదున్నారు. దిల్‌రాజు నోటిదూల తీర్చేందుకు కాచుక్కూర్చున్నారు. సమయం రానేవచ్చింది. ఇక వేట మొదలుపెట్టాడు. ఆ వేటాడటం మాములుగా లేదు ఓ రేంజ్ లో ఉంది మరి.
పాపం.. మన దిల్‌రాజు ఎందుకు నిజామాబాద్‌లో ప్రోగ్రాం పెట్టాడో పెడితే పెట్టాడు పో.. ఎందుకు యాంకర్ మాటలు విని టెంప్ట్ అయ్యాడో…. మీ మాటలు ఓ రేంజ్‌లో వైరల్ కావాలి సార్ అని ఆ పిల్ల అన్నది నిన్ను నువ్వు వైరల్ చేసుకుని చిల్లరైపోమని కాదు రాజా…! మందు, మటన్ అంటివి… కల్లు,చెట్లంటివి…! మనకదే లోకమంటివి..? సొంత గడ్డ మీద మనోళ్ల ఇజ్జత్ నువ్వే తీస్తివి. ఇగ ఊకుంటరా.. నువ్వు కష్టపడి బెనిఫిట్ షోలు ఏపించుకున్నా.. టికెట్ల రేట్లు పెంచుకుని బతికి బయటపడదామన్నా.. నిన్ను వదలేలా లేరు. నీకిక చిల్లరే మిగిలనుందనే కాడికి వచ్చింది వారి కామెంట్ల జోష్.
రాజా..! నిజం చెప్పు ఎందుకునీకంత నోటి ధూల…! అహంకారం నెత్తికెక్కిందా..? మాట తీరే అంతా..! ముందే మూతి వంకర.. నవ్వితే ఎక్కిరిచ్చినట్టు… మరి మాటలన్నా సాఫ్ట్ గా, తియ్యగా ఒదిగినట్టు, బతిమాలుకున్నట్టు… లొంగినట్టు, ఒంగినట్టు.. ఉండాలి కదా.. అహ అలా అని నీనడం లేదు.. మనోళ్లే అనుకుంటున్నారు. నువ్వలా ఉండకపోగా… ఇలాతయారవయ్యావేందనే వారి బాధ. అందుకే మూతి వంకరను సక్కగ చేద్దామనుకున్నారేమో… దాడి మొదలైంది సోషల్ మీడియాలో. శంకర్ ఇక మళ్లీ ఇటువైపు ముఖం కూడా చూపడు పో..! అయినా ఓ రేంజ్లో ఉన్నప్పుడు మన టాలీవుడ్ అతగాడికి గుర్తు రాలేదు.. ఇప్పుడు తనో ఐరెన్‌లెగ్.. నిన్ను బలి తీసుకునేందుకు ఇక్కడికొచ్చాడు. బలి చేశాడు.
సరే.. గానీ కామెంట్లు పెట్టెటోళ్లంతా సినిమాలు చూసి పెడుతున్నారా..? ఏమో నాకైతే డౌటే. సరే, అదంతా పోనీ.. పాపం దిల్ రాజు మనోడే కదనోయ్… జర వదిలేయరాదుండ్రి.. ఇక నుంచి ఒళ్లు , మూతి, నోరు అన్నీ దగ్గర పెట్టుకుంటాడా….? మళ్లీ బలగం అసొంటి సినిమాలు తీసి పాపం కడుక్కుంటాడంట… వదిలేయండి… ప్లీజ్.. పాపం…….