(దండుగుల శ్రీ‌నివాస్‌)

అప్పుడెప్పుడో దిల్‌రాజు తీసిన ఎవ‌డు సినిమా మొద‌టి రోజే చూసి రివ్యూ రాయడం షురూ చేసిన‌. దిల్ రాజు తీసిన సినిమా … అదీ మావోడు.. అంటే నిజామాబాదోడు. డౌన్ టు ఎర్త్. కింది స్థాయినుంచి ఎదిగి వ‌చ్చినోడు. ఆ త‌రువాత కూడా కొన్ని కొత్త సినిమాల‌కు రివ్యూలు రాస్తూ వ‌చ్చాను ఫ‌స్ట్ డేనే స‌నిమా చూసి. ఆ త‌రువాత అది త‌గ్గింది. అస‌లు నాకు మొద‌టి రోజు సినిమాలు చూసే అల‌వాటు కూడా లేదు. దోస్తుల‌తో క‌ల‌సి నేను ఫ‌స్ట్ రోజే చూసిన సినిమా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ది. బ‌ద్రి.

ఇదంతా ఎందుకుగానీ.. ఈ మ‌ధ్య దోస్తులు చాలా మందే అడుగుతున్న‌రు.. నువ్వు సినిమాల మీద రివ్యూ రాయ‌డం లేదెందుక‌ని. కానీ నాకు మాత్రం ఇంట్ర‌స్టు త‌గ్గింది. ఓటీటీల కాలంలో అంద‌రిలా నేనూ దానికే అల‌వాటు ప‌డిపోయిన. ప‌క్కింటి పుల్ల కూర రుచి అన్న‌ట్టు… ఓటీటీలో క్రైం, స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్, అప్పుడ‌ప్పుడు యాక్ష‌న్‌, కామెడీ…. ప‌ర భాష‌ల సినిమాలంటే నాకిష్టం. మ‌నోళ్లు అలా ఎందుకు తీయ‌ర్రా బై.. ఎప్పుడు మారుతారో అనుకుంటాను అంద‌రిలా నేనూ. స‌రేఈ స‌న‌, ఇప్పుడు అస‌లు విష‌యానికొద్దాం…! మ‌న దిల్ రాజు.. అదే మావోడు.. అదే అదే మా నిజామాబాదోడు అంతా ఊడ్చి ఇజ్జ‌త్ కా స‌వాల్ అని తీసిన సినిమా గేమ్ చేంజ‌ర్. అది హిట్టు కావాల‌ని కోరుకున్నా. శంక‌ర్ డైరెక్ష‌న్‌పై మంచి గురి కూడా. అది అప్ప‌ట్లో. ఇది క్ర‌మంగా మారుతూ వ‌చ్చింది. అది ఎక్స్‌పైరీ మెడిసిన్ గా మారింది నా దృష్టిలో. విక్ర‌మ్ ఐ సినిమా చూసిన ద‌గ్గ‌ర నుంచి. ఇక్క‌డో ముచ్చ‌ట చెప్పుకోవాలి.

మంచి ఫామ్ లో ఉన్న‌ప్పుడు టాలీవుడ్ క‌న‌ప‌డ‌లేదు శంక‌ర్‌కు. రిటైర‌యి ఇంటికి పోవాల్సిందేన‌ని అంతా అనుకుంటున్న స‌మ‌యంలో ఇలా టాలీవుడ్ తలుపులు త‌ట్టాడు. బ‌క్రా దిల్‌రాజు దొరికాడు. మ‌న ద‌గ్గ‌ర కూడా ఓ రేంజ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న డైరెక్ట‌ర్లు … ఆ త‌రువాత ఢాం అని ప‌డిపోయినంక అవ‌కాశాలు లేక‌… చేతికి అందుబాటులో ఉన్న సినిమాలు తీసిన‌ట్టు. ఎగ్జాంపూల్ పూరీ , ఆర్జీవీ. అలాంటి వాడే ఇప్పుడు శంక‌ర్ కూడా. ఇలా అన్నీ తెలిసినా.. శ‌కునం చెప్పే బ‌ల్లి కుడితిలో ప‌డ్డ‌ట్టుగా దిల్‌రాజు వెళ్లి శంక‌ర్ మానియా అనే ఊబిలో ప‌డి కూరుకుపోయాడు. దీనికి తోడు దిల్ రాజు నోటిదూల‌. వాస్త‌వంగా చెప్పాలంటే దిల్‌రాజ్‌కు స్టేజ్ ఫియ‌ర్‌. క‌ళ్లు నెత్తికెక్కిన వ్య‌వహారం. అహంకారం. అంతా త‌న‌కే తెలుసున‌నే గ‌డుసుత‌నం.

కింది స్థాయి నుంచి వ‌చ్చినోడికి ఇవి చాలు కింద‌ప‌డేయ‌డానికి. అత‌ని ద‌గ్గ‌రి బంధువే అంటాడు ఒకాయ‌న‌. ఎంతెగినా ఏం లాభం బై. అత‌నికి హెల్పింగ్ నేచ‌ర్ లేదు. వాడుకుని వ‌దిలేసే ర‌కం. అని. అదంతా పోనీ… ఒక్క‌టి మాత్రం నిజం. మెచ్చుకోవాలి. దిల్‌రాజును. ఎదిగాడు. ఓ మారుమూల ప్రాంతం నుంచి వ‌చ్చి టాలీవుడ్ పెద్ద‌ల వ‌ద్ద త‌న ప‌ర‌ప‌తి, ప‌రువు, స్ట్రేచ‌ర్ చాటుకున్నాడు. భేష్‌… ఇదో కోణం.. ఇప్పుడు దాన్ని ట‌చ్ చేయ‌ను. నేను మాత్రం అంద‌రూ సోష‌ల్ మీడియాలో వాగ్దానం చేసిన‌ట్టుగా… అల‌వాటైన దోర‌ణిలో. అంద‌రిలా. గేమ్ చేంజర్ స‌నిమాను ఓటీటీలోనే చూస్తా. అప్పుడు స‌మ‌యంఉంటే.. ఇంట్ర‌స్ట్ కూడా ఉంటే రివ్యూ రాస్తా. నేను ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో కామెంట్ చేయ‌ను. నాకా హ‌క్కులేదు. కానీ దిల్ రాజు.. రోడ్డున ప‌డ‌కుండా ఉండాల‌ని మాత్రం ఘా…. డంగా కోరుకుంటున్నా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed