మీ మూసీ గలీజ్ రాజకీయాలు ఆపుతారా..! ఏడాది కూడా కాకముందే ఇంతటి వివాదాలు అవసరమా..? బీఆరెస్ జనాల్లోకి ఎందుకు వెళ్లడం లేదు… వారి సమస్యలు దీనికి పట్టవా..? మూడు ప్రెస్‌మీట్లు.. ఆరు ట్వీట్‌లు.. ఇదే కేటీఆర్ విధానం.. రైతు భరోసాపై ఏదీ నిలదీత…? రుణమాఫీపై చల్లబడ్డారెందుకు..?? మూసీతో ఇంత అర్జెంటుగా ఎవరికి లాభం..? జనం ఏం కోరుకుంటున్నారు..? మీరేం చేస్తున్నారు… సర్కార్, ప్రతిపక్షం తీరుపై జనం ఏవగింపు..
(దండుగుల శ్రీనివాస్) అసలు రాష్ట్రంలో ఏ సమస్యలేనట్టు.. ప్రభుత్వం ఏర్పడీ ఏర్పడగానే మూసీ వెంట పడటమేమిటో ఎవరికీ అర్థం కాని విషయం. కేసీఆర్‌ను కాదని, కాంగ్రెస్‌ను తెచ్చుకున్నారు జనాలు. రేవంత్ రెడ్డి కొత్తగా ఇంకేమైనా చేస్తాడేమోనని ఆశగా తెచ్చుకున్నారు. ఇచ్చిన హామీలు…