Dandugula Srinivas

ఇదో విచిత్ర ప‌రిస్థితి. అధికారుల నిర్ల‌క్ష్యం. ప‌ట్టింపులేని త‌నం. ఇంకా కేసీఆర్‌ను మ‌ర‌వ‌లేక‌పోతున్నారో… సీఎం రేవంత్ రెడ్డిని స్వీక‌రించ‌లేక‌పోతున్నారో తెలియ‌దు కానీ.. ఇంకా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఫోటో పెట్ట‌లేదు. చూసీ చూసీ విసిగి వేసారిన స‌ర్కారే స్వ‌యంగా జోక్యం చేసుకోవాల్సిన దుస్థితి నెల‌కొన్న‌ది. వారే ఈ రోజు ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసి ఈ ఫోటో పెట్టండ్రా బాబు.. అని ఆదేశాలిచ్చి.. అల్టిమేటంగా ఓ డేట్ ఇచ్చి మ‌రీ వేడుక‌లు, వార్నింగులివ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మాములుగా ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే సీఎంగా రేవంత్ ఫోటోను అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో పెట్టుకోవాలి. కానీ కొంద‌రు పెట్టారు.

ఇంకొంద‌రు ఎవ‌రి ఫోటోను పెట్ట‌కుండా గాంధీ , అంబేద్క‌ర్ ఫోటోల‌తో నెట్టుకొచ్చారు. ఇది స‌ర్కార్ దృష్టిలో ప‌డింది. కొన్ని సార్లు సూచ‌న చేసినా లైట్ తీసుకున్న‌ట్టు కూడా స‌ర్కార్ గ్ర‌హించింది. అందుకే గురువారం సీఎంది ఓ ఫైన్ ఫోటో ఒక‌టి సెలెక్ట్ చేసి.. ఇగ ఇన్నాళ్లూ ఫోటో పెట్ట‌లేదు క‌దా.. ఇప్ప‌ట్నుంచి ఈ ఫోటోను వాడుకోండి .. త‌ప్ప‌నిస‌రిగా… అంటూ ఓ ఫోటో ఫ్రేమ్‌ను రిలీజ్ చేసింది. అంతేకాదు వ‌చ్చేనెల ఏడు వ‌ర‌కు గ‌డువుకూడా ఇచ్చింది. ఆ త‌రువాత ఇంకేదో సాకులు చెప్పి త‌ప్పించుకోవాల‌ని చూస్తూ ఊరుకునేది లేదు సుమీ అనే ప‌రోక్ష వార్నింగ్ కూడా ఆ ఆల్టిమేటంలో దాగుంది. ఇగో ఇలా ఉంది మ‌న అధికారుల ప‌రిస్థితి. మ‌రి క‌లెక్ట‌ర్లు కూడా ఈ తొమ్మిది నెల‌లు ఏం చేస్తున్నారో ..!

స‌ర్కార్ ప్ర‌క‌ట‌న ఇలా..

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల, అధికారులకు ఈరోజు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం ఫైనల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించింది.
అక్టోబర్ 7వ తేదీలోపు అన్ని ప్రభుత్వ కార్యాల యాల్లో ముఖ్యమంత్రి కొత్త ఫోటో ఏర్పాటు చేయాలని కోరింది. ఈ మేర‌కు జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో నమూనాను కూడా విడుదల చేస్తూ ప్రభుత్వం కార్యాలయాల్లో సీఎం పెట్టా లని తెలిపింది. ఇప్పటికే కొందరు నాయకులు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో లేదనే వాదనపై ప్రభుత్వం స్పందించింది.

దీంతో వచ్చే నెల 7వ తేదీ వరకు గడువు ఇస్తూ ఆదే శించింది. అన్ని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రభు త్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తి అయిన ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను అన్ని ప్రభుత్వ కార్యాయాల్లో సీఎం ఫోటో ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ అక్టోబర్ 7వరకు గడువు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed