వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్:
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రేపు ఆదివారం రాష్ట్రంలోని ఎమ్మార్వోలందరితో కీలక భేటీ కానున్నారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో ఈ సమావేశం జరగనుంది. అందరికీ మెసేజ్ వెళ్లిపోయింది. ఇక అంతా రెడీ అయ్యారు మంత్రిగారు ఏం చెబుతారోనని. ప్రభుత్వం ఏర్పడిన తరువాత పొంగులేటి తొలిసారిగా రాష్ట్రంలోని దాదాపు 900 మంది తహసీల్దార్లతో కలిసి లంచ్ చేయనున్నారు. అంతకు ముందు కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఆయన ఏం చెబుతారు..? ఏం సందేశమిస్తాడు..? అనేదే రెవెన్యూ సెక్షన్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ప్రజాపాలనలో రెవెన్యూ వ్యవస్థ కీలకం. గతంలో పాలకులు చేసిన తప్పిదాలేమిటీ… ? మనం ఏం చేద్దాం…? పరిపాలనలో ప్రజాపాలన మార్కు కోసం ఏం చేద్దాం..? ఏం చేయాలి..? అనే కీలక విషయాలపైనే ఆయన చర్చించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ధరణి, భూమాత అంశాల ప్రస్తావన దీంట్లో వచ్చే అవకాశం కనించడం లేదు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలు, ప్రజాబాహుళ్యంలోకి సంక్షేమ ఫలాలు తీసుకెళ్లడంలో రెవెన్యూ శాఖే కీలకం. అందుకే వీరితో ఆయన ప్రత్యేకంగా ఆయన ఆదివారం సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.