నేను జనాభా లెక్కల విదులు ఇప్పటికి రెండు సార్లు నిర్వహించడం జరిగింది! మొదటిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని మల్లాపూర్ మండలం సాతారం జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో పని చేస్తున్నపుడు , 2001 లో జనాభా లెక్కల సేకరణ లో భాగంగా ఇల్లిల్లు తిరిగి వివరాలు సేకరించేది! నిబందనల ప్రకారం భారత దేశం లో నివసిస్తున్న వారి వివరాలను మాత్రమే లెక్కించాలి! ఉపాధికోసం ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి వివరాలు సేకరించబడడేవి కావు! అలా ఆ గ్రామం లో అనేక మంది అవుటాఫ్ లో ఉన్నట్లు తేలింది! ఆ చుట్టు పక్కల గ్రామాలైన గుండంపల్లి , రేగుంట , చిట్టాపూర్ , ధర్మారం , ఐలాపూర్ తదితర గ్రామాల్లో కూడా అదే స్థాయిలో ఫారిన్ లో ఉన్నట్లు గుర్తించబడ్డవి ! అట్ల కరీంనగర్ కు పశ్చిమ దిశలో ఉన్న అనేక గ్రామాల్లో అప్పుడు పురుషుల జనాభా కంటే మహిళల జనాభా ఎక్కువగా రికార్డు ఐయింది !

సహజంగానే 2011 లో జరిగిన జనాభా లెక్కల్లోనూ జగిత్యాల మొదలు కోరుట్ల , మెట్పల్లి , ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహిళ : పురుషుల నిష్పత్తి ఎక్కువగా ఉన్నది ! అప్పటి లెక్కల ప్రకారం అటువైపు అన్ని నియోజకవర్గాలు మహిళలకే రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నవి ! అయితే ఇప్పుడు రాబోతున్న మహిళా రిజర్వేషన్ బిల్లులో కొత్త లెక్కలు పరిగణ లోకి తీసుకోనున్నరు ! 2021 లో జరుగాల్సిన జన గణన వాయిదా పడ్డది ! కనుక మళ్ళీ నిర్వహించి ఆ లెక్కల ప్రకారం నియోజకవర్గాలను రిజర్వు చేస్తరు ! అట్ల చేసినా కూడా ఇంచు మించు అటువైపు నియోజకవర్గాలే మహిళలకు రిజర్వు అయ్యే సంభావ్యత ఎక్కువ ! మరోవైపు , 2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన మళ్ళీ 2026 లో జరుగనున్నది !

ఆ లోపు జన గణన పూర్తి చేసి వాటితో పాటే మహిళల నియోజకవర్గాలను తేల్చనున్నరు ! నియోజకవర్గాల సంఖ్యను పెంచరు !! ఎస్సి , ఎస్ టి నియోజకవర్గాలు సైతం మారనున్నవి ! వాటిల్లోనూ మహిళల వాటా ఉండనున్నది ! కనుక రాజకీయ ముఖ చిత్రమే మారిపోనున్నది ! భవిష్యత్ తెలంగాణ మహిళా ముఖ్యమంత్రి ఏలే అవకాశం కూడా ఉన్నది ! కనుక తండ్రులు తమ రాజకీయ వారసులుగా అవకాశాన్ని కొడుకులకు కాకుండా బిడ్డలకు ఇస్తరని ఆశిద్దాం

TTR

You missed