నటుడు, బిచ్చగాడు ఫేం, హీరో, విజయ్ ఆంథోని కూతురు ఆత్మహత్య ఎందుకో బాధ అనిపించింది. ఇజ్జత్ లేని సమాజం లో బతుకుతూ మన ఇజ్జత్ గురించి ఆలోచించకూడదు.
ఉదయం కొండాపూర్ లో నడుచుకుంటూ వెళ్తుంటే…వెనక నుంచి ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుతిరిగి చూస్తే వెనక ఎవరూ లేరు.
జీవితం మనం అనుకున్నంత పెద్దదీ కాదు, మరీ చిన్నది కాదు, ఈ ఐస్ మ్యాన్ లా కరిగిపోవాల్సిందే. ఉన్నంత కాలం జీవితం అంటే ఒక పండుగ లా జీవించాలి, ఒక ఉత్సవం లా జరుపుకోవాలి అంటారు పెద్దలు.
సమాజం ఏమనుకుంటదో అని అనిపించటం సహజమే; తక్కువ మార్కులు వచ్చాయి, 12 వ తరగతి ఫెయిల్ అవుతానేమో లేదా ఫలానా వాళ్ల లాగా సెటిల్ అవ్వలేకపోయాము, లేదా జీతం తక్కువ, అప్పుల వాళ్లు ఏమనుకుంటారో అని ఆత్మహత్య చేసుకోవటం కరక్ట్ కాదు. కారణం సమాజానికే సిగ్గు లేదు. సిగ్గు & ఇజ్జత్ లేని సమాజం లో బతుకుతూ మన ఇజ్జత్ గురించి ఆలోచించకూడదు.
ఈ భూమి మీద మనకి తెలిసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పోతారు, అలాంటప్పుడు ఎల్లయ్య నో పుల్లమ్మ నో ఏమనుకుంటే మనకేంటి..? నవ భారతం సినెమా లో ఒక పాట ఉంటుంది. బాగా చదివి ఉద్యోగం కోసం తిరుగుతూ ఉంటే సిగ్గు లేదా మీకు ఇంకా ఉద్యోగం తెచ్చుకోకుండా అని ఎవరో అంటే “సిగ్గు సిగ్గు అంటవ్, సిగ్గు ఏందిరో, సిగ్గు పడే పనేమి చేయలేదురో అని ” ఒక పాట ఉంటుంది. నిజానికి సిగ్గు పడే పని చేసినా ఏం పట్టించుకోనవసరం లేదు కారణం సమాజానికే సిగ్గు లేదు..!
– రోమన్ తత్వవేత్త
Jagannadh Goud