దేశంలో చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు కావాలని అన్ని రాజకీయ పార్టీలు దశాబ్దాలుగా మాట్లాడుతూనే వచ్చాయి. కానీ మహిళ బిల్లును అందించే పోరాట కార్యశీలతను తుదకంట కొనసాగించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. రాజకీయాలు మహిళల ఓట్లు కోసం మహిళా బిల్లు డిమాండ్ వాడుకుంటున్నారు తప్ప దానిని సాధించే కర్తవ్యాన్ని ఎవరు పూనుకోవడం లేదనే వేదన మహిళ లోకంలో మిగిలిపోతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో మన తెలంగాణ ఉద్యమ నాయకురాలు, మన కవితమ్మ మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తేవడంలో ముందుండి పోరాటానికి దిగారు.

మహిళా బిల్లును నాన్చడం ఇంకెంతకాలం అంటూ ఢిల్లీ లో కదన గర్జన చేశారు కల్వకుంట్ల కవిత. సూటిగా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే నిలదీత దృక్పథంతో, .. ఒకరకంగా చెప్పాలంటే మహిళా బిల్లు సాధన కోసం మెరుపు దాడి లాంటి పోరాటాన్ని కవిత మొదలుపెట్టడంతో మూలన పడి నానుతున్న మహిళా బిల్లు చట్టసభల ముంగిటకు చేరింది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మతో మహిళలోకాన్ని జాగృతం చేసిన ఉద్యమ నారీమణిగా దేశమంతా తెలిసిన కవిత ఢిల్లీ వీధుల్లో మహిళా బిల్లుపై కేంద్రంలో అధికార బిజెపిని, దేశంలోని రాజకీయ పక్షాలను సూటిగా నిలదీయడంతో కవిత చేపట్టిన మహిళా బిల్లు పోరాటానికి వెంట వెంటనే విశేష మద్దతు మొదలైంది.

మహిళా బిల్లు పట్ల నాన్చుడు ధోరణి అవలంబిస్తూ వస్తున్నది ఏ రాజకీయపక్షమైనా.. ఏ నాయకులైనా నిర్మొహమాటంగా, నిర్భయంగా నిలదీస్తూ పోతుంటే మహిళా బిల్లు పట్ల సదరు రాజకీయ వర్గాలు, నాయకులు తమ స్పష్టమైన వైఖరిని తక్షణమే ప్రకటించాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పార్లమెంటు సమావేశాల సందర్భంగా పెట్టిన పలు డిమాండ్లలో మహిళా బిల్లు ప్రస్తావన ఎందుకు లేదని కవిత సంధించిన ప్రశ్న ఇందుకు నిదర్శనం. మహిళా బిల్లుపై తమ సానుకూల వైఖరి విస్పష్టమని సోనియా గాంధీ సైతం ప్రకటన చేయాల్సి వచ్చింది. మహిళా బిల్లుపై ఢిల్లీలో ధర్నాతో మొదలుపెట్టిన నుంచి బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేటి పరిణామాల వరకు కవిత కొనసాగించిన పోరాటంలో బిల్లు సాధించడమే స్పష్టమైన లక్ష్యంతో పాటు ఆ పోరాటంలో పదును చివరికంట కనిపించాయి.

మహిళా బిల్లుపై కవిత చేస్తున్న పోరాటాన్ని, బిల్లు ముందుకు రావడంలో కవిత కృషిని, మహిళా బిల్లుకు ఒక్కసారిగా జాతీయస్థాయిలో ఎన్నో వర్గాల మద్దతు వెలువడడం పై నేషనల్ మీడియా సైతం ఎటువంటి మొహమాటానికి పోకుండా ప్రశంసిస్తూ వస్తున్నది. మహిళా బిల్లు కదిలి వచ్చి కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని పొందిన వేళ దేశవ్యాప్తంగా కవిత కృషి పై ప్రశంసల జల్లు కురిసింది.

You missed