తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలతో నిర్మించుకున్న పార్టీని, పాలకులను ఫాల్స్ కేసులలో ఇరికించి,వేధించే కుట్రలో భాగమే ఢిల్లీ లిక్కర్ కేసులో శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కు ఈ. డి నోటీసులని భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మదుసుధన్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలకుల పాపాత్మక ఆలోచనల నుండే పుట్టిన నోటీసులని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఓర్వలేని మోడీ,షా ల ద్వయమే ఈ డి నోటీసుల వెనుక ఉన్నారని ఆరోపించారు.
కవిత వెనుక తెలంగాణ ప్రజాసమూహాలు ఉన్నాయని ,ఆ సమూహాల ధాటికి భాజపా అనే విషపు నాగులు మట్టికరువ మానరని ఆయన అన్నారు. ప్రజలతో మమేకమై జీవితాలు బి.ఆర్. ఎస్ సొంతమని ,ప్రజలతో పెట్టుకున్న కేంద్ర పాలకులు ప్రజా సునామిలో కొట్టుకుపోతారని ఆయన పేర్కొన్నారు. కవిత కడిగిన ముత్యమోలే ఈ డి కుట్రపూరిత విచారణ నుండి బయటపడతారని తెలిపారు.బి. ఆర్. ఎస్. లీగల్ టీమ్ చట్టబద్ధంగా ఈ. డి నోటీసులను ఎదుర్కొంటుo దని, న్యాయం కవిత పక్షమేనని, పక్షపాతంతో కూడిన ఈ. డి చట్టం ముందు ఓడిపోయి ,కవిత విజయం సాధిస్తారని మధుసుదన్ రావు అన్నారు