దిద్దుబాటులో తప్పటడుగులు..
రేవంత్‌ మాటల గాయానికి మందు రాసేందుకు అష్టకష్టాలు..
ఉచితం వద్దంటారు.. మేమే ఉచితం ఇచ్చామంటారు.. నేతల ద్వంద్వ వైఖరితో ప్రజల వద్ద మరింత పలుచన…

బీఆరెస్‌ నెత్తిన పాలుపోస్తున్న కాంగ్రెస్‌…

 

కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగుతూ మరిన్ని తప్పుల తడబాటు మాటల తో ఇంకా పలుచనవుతోంది…. రేవంత్ కరెంట్ పై చేసిన తలతిక్క మాటలను ఎలా సరిదిద్దాలో తెలియక తికమక పడుతోంది. ఎలా సమర్థించుకొని రైతుల ముందు ముఖం చూపాలో తెలియక కిందా మీదా పడుతోంది.. తల్లడమల్లడమవుతుంది. మూడు గంటలని ఒకసారి… కాదు కాదు తొమ్మిది గంటలని మరోసారి….

అసలు ఉచిత కరెంట్ కాన్సెప్టే మాదని ఇంకోసారి…. ఇలా ఏదో మాట్లాడి ఏమేమో తంటాలు పడుతున్నది.. ఇది చాలదంటూ మీడియా నూ లాగుతున్నది. సోయిలేని మాటలు మాట్లాడింది మీరు…. మీ నాయకులే నాలుక్కర్చుకొని ఏమనాలో తెల్వక నెత్తికొట్టుకొని రేవంత్ ను దోషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తుంటే…. మధ్యలో మీడియా ఏం చేసింది.. ??

ఇవి చాలవంటూ రాజశేఖర్ రెడ్డి పేరునూ లాగారు. నష్ట నివారణ ఏమైనా జరుగుతుందేమోనని…. కానీ ఈ వ్యూహం తిరగబడేదని గ్రహించ లేదు వాళ్ళు పాపం.. తెలంగాణ వ్యతిరేఖి గా రాజశేఖర్ రెడ్డి, చంద్ర బాబు ముద్రపడ్డారు… వీళ్లిద్దరి పేర్లను, ప్రమేయాన్ని… నేపత్యాన్ని తీసుకుంటే కొండ నాలుక కు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టేనని.. బీఆరెస్ కు మరింత బలం చేకూర్చినట్టేనని తెలుసుకోలేక పోతున్నారు..

You missed