అర్వింద్‌కు అక్క భయం..
కవిత యాక్టివ్ పాలిటిక్స్‌తో బెంబేలు… మళ్లీ లిక్కర్ కేసును బూచీగా చూపే యత్నం..
డీలా పడిన బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు…
ఎంత లేట్ అయితే అంత గట్టిగా కేసు ఉంటుందని పరోక్షంగా ఢిల్లీ లిక్కర్ స్కాం పేరును వాడుకునే కుటిలయత్నం….
కాంగ్రెస్ పుంజుకోవడం.. బీజేపీ డీలా పడటం.. బీఆరెస్‌లో కవిత దూకుడు….. జీర్ణించుకోలేకపోతున్న అర్వింద్..
రాజకీయాల్లో పరిస్థితుల్లో ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనదే నడవాలంటే ఎల్లప్పుడు అలా కుదరదు. హవా కొంతకాలమే. కాలచక్రం తిరిగే కొద్దీ పరిణామాలూ మారుతాయి. ఇప్పుడు ఇందూరు రాజకీయాల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఎంపీగా కవితపై గెలిచిన అర్వింద్ మొన్నటి వరకు తనకు తిరుగలేదనుకున్నాడు. జిల్లాలో బీజేపీకి ఇక ఎదురేలేదనుకున్నాడు. కానీ ఒక్కొక్క పరిణామం ఆ పార్టీని ప్రశ్నార్థకంలో పడేసి డీలా చేసేస్తోంది. దీనికి తోడు ఎమ్మెల్సీ కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఆమె దూకుడు చూసి అర్వింద్ జడుసుకున్నట్టున్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో మొన్నటి వరకు బీజేపీ శ్రేణులు పండుగ చేసుకున్నాడు. కవిత జైలుకు పోవడం ఖాయమనే రీతిలో సంబురాలు చేసుకున్నారు.
కామెంట్లు పెట్టుకున్నారు. కానీ కొండంత రాగం తీసి.. ఏదో అన్నట్టు ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో చేసిన హడావుడి ముగిసింది. అసలు దాని గురించి పట్టించుకునేవారేలేరు. అది గడిచిన, గతించిన సంఘటనలా మారిపోయింది. కానీ ఇది బీజేపీని పెద్ద దెబ్బే తీసింది. కవితను అరెస్టు చేయలేదంటే బీజేపీదే లోపం.. అనే రీతిలో స్వపక్షంలోనే వచ్చింది. దీంతో అంతటా బీజేపీపై రాజకీయంపై, అధిష్టానంపై అపనమ్మకం, అపప్రదతో ఉన్నారు. బెదిరించేందుకు ఉపయోగించే ఈ అస్త్రం కాస్తా బీజేపీకే తాకింది. దీంతో మరింత డీలా పడిపోవడంతో కషాయ శ్రేణులు అయోమయంలో పడ్డారు.
దీనికి తోడు ఇందూరు రాజకీయాల్లో కవిత యాక్టివ్ కావడం.. అందరినీ కలవడం.. పార్టీని బలపేతం చేసి జిల్లాలో పూర్వవైభవం కోసం దూకుడు మీద ఆమె వెళ్తున్న తీరు బీజేపీ శ్రేణులను.. ముఖ్యంగా ఎంపీ అర్వింద్‌ను కలవరపెడుతున్నాయి. అందుకే అతను మళ్లీ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును బూచీ వాడుకోవాలని చూస్తున్నాడు. బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు దిగాడు. తనకు షరా మామూలైన రీతిలో. సోమవారం అంకాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పరోక్షంగా ఈ కేసు మరింత బలంగా కాబోతుందని, కవిత జైలుకు వెళ్లకతప్పదనే ఉద్దేశ్యంతో ఇన్‌డైరెక్ట్‌గా ఆ పార్టీ శ్రేణులకు బూస్టింగ్ ఇచ్చే పనిని భుజానేసుకున్నాడు. పనిలో పని బావకు కూడా కేసులు తప్పవంటూ హరీశ్‌రావు ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. మట్లాడేందుకు సబ్జెక్టు లేదు. ఏం చేస్తామో చెప్పేందుకు ముందస్తు ప్లానింగ్ లేదు. డీలా పడిన పార్టీకి జాకీలు పెట్టి లేపేదెలా…? అనుకుని ఇలా ఢిల్లీ లిక్కర్ స్కాం మెడకేసుకుని తిరుగుతున్నాడు అర్వింద్.