బీజేపీ డైరెక్షన్‌లో బీసీ జర్నలిస్టలు ఫోరం…
అందుకే మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం డుమ్మా..

ఈటలను పిలిపించి.. కేసీఆర్‌ను తిట్టించి… ఉద్దేశ్యమొకటి.. పేరు జర్నలిస్టుల ముసుగా…?

ఇప్పుడిదే జర్నలిస్టు సర్కిళ్లలో హాట్‌ టాపిక్‌…

వాస్తవం ప్రతినిధి, హైదరాబాద్‌:

మొన్న బీసీ సమాజ్‌ ఆధ్వర్యంలో బీసీ జర్నలిస్టుల సమ్మేళనం జరిగింది. వెనుకబాటులోనే మగ్గిపోతున్న బీసీల సాధికారతలో బీసీ జర్నలిస్టుల పాత్ర అనే అంశంపై ఈ సమ్మేళనం నిర్వహించారు. పైకి ముసుగు బీసీ జర్నలిస్టులు.. కానీ దీన్ని వెనుకుండి నడిపించిందంతా బీజేపీనే. బీజేపీ డైరెక్షన్‌లోనే ఈ సమావేశం జరగడం… చివరికి బీసీ జర్నలిస్టుల ఫోరం ఒకటి ఏర్పాటు కావడం జరిగిపోయింది. ప్రస్తుతం ఇదే అంశం అటు హైదరాబాద్‌ జర్నలిస్టుల సర్కిళ్లతో పాటు అన్ని జిల్లాల్లో కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. దీన్ని ముందుండి నడిపించిన సీనియర్‌ జర్నలిస్టులు తొలత దీని బీసీ కలరింగిచ్చారు. బీసీల అభ్యున్నతి కోసమే అని నమ్మబలికారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణను, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను పిలిపించారు. చివరకు ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా దీని వెనుక బీజేపీ ఎజెండా ఉందని, ఈ వేదిక అంతా బీజేపీ అనుబంధంగా పనిచేసేదేనని, సీనియర్‌ జర్నలిస్టులుగా ముందుండి నడిపేవారంతా బీజేపీకి సపోర్టర్స్‌నే విషయం తెలుసుకున్నారు. అందుకే మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణలు దీనికి డుమ్మా కొట్టారు. దీంతో ఈటలకు మరింత అవకాశం దొరికికట్టైంది. బీసీలు, బీసీ జర్నలిస్టుల కాన్సెప్ట్‌ పక్కకు పోయి.. కేసీఆర్‌ కు పార్టీ పెట్టినప్పుడు ఎన్ని పైసలుండే.. ఇప్పుడు ఇన్ని కోట్లెలా వచ్చినయ్‌… ఇతర రాష్ట్రాలకు ఎన్నికల ఫండింగ్‌ చేస్తుండు.. అంటూ ఫక్తు పొలిటికల్ స్పీచ్‌ ఒకటి ఇచ్చే వెళ్లిపోయాడు.

ఇందులో కొనమెరుపేంటంటే.. బీసీ జర్నలిస్టులుగా వచ్చినవారంతా యూట్యూబ్‌ చానళ్లు, వెబ్‌ సైట్లు నడిపించుకుంటున్నవాళ్లే. అసలు వీళ్లను జర్నలిస్టులుగానే చూడమని అల్లం సార్‌ చెప్పనే చెప్పాడు. వీళ్లకే జర్నలిస్టుల హోదా లేకుండా పోయినప్పుడు దాని పై మాత్రం ఎవరూ మాట్లాడలేదు. మనమంతా బీసీ సమాజాన్ని ఎలా బాగుపరుద్దాం అనే దానిపై మాత్రం డిస్కషన్‌ కోసం వచ్చారు. దీనికి మళ్లీ తెలంగాణ బీసీ జర్నలిస్టుల ఫోరమని పేరు కూడా పెట్టేసుకున్నారు. ఎన్నికల వేళ బీజేపీ మెల్లగా తన శక్తులను కేంద్రీకరించుకుంటూ వస్తోంది. ఇదీ అందులో భాగమే అంటున్నారు. కాదంటారా…!

You missed