ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు. ఎల్లప్పుడూ అబద్దాలు చెల్లుబాటు కావు. వ్యక్తిత్వం కడవరకు ఉంటుంది. అప్పటిమటుకు ఏదో చెప్పేసి దాటేద్దాం.. పదవి ఎక్కేద్దాం అంటే కుదరుదు. ఇగో ఇట్లనే అవుతుంది. రైతుల చిరకాల వాంఛ పసుపుబోర్డు సెంటిమెంటను బాగా వాడుకుని ఎంపీగా గెలిచేందుకు అబద్దాలాడాడు అర్వింద్‌. ఐదు రోజుల్లో తెస్తానని ఏకంగా బాండు పేపరూ రాసిచ్చాడు. కానీ రాలేదు. ఇవ్వమంటే ఇవ్వమని కేంద్ర పెద్దలే చాలా సార్లు చెప్పారు. తాజాగా మరోసారి అదే మాట వల్లెవేశారు. దీంతో తిక్కరేగింది రైతులకు. ఇగ నువ్వు పసుపుబోర్డు తేవు.. కాదు పోదు కానీ.. ఇగో ఇదే నువ్వు తెచ్చిన పసుపు బోర్డు అంటూ పసుపు కలర్‌తో రాసిన బోర్డులను ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు ఇందూరు రైతులు. ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. నిన్న మొన్నటి దాకా ఇంట్లో రచ్చ. ఇప్పుడు రాజకీయ రచ్చ. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. పాపం.. అర్వింద్‌ ఆ రెండింటా ఓడిపోయి.. ఇలా రాజకీయ దివాళకోరుగా మిగిలిపోయాడంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

దీనిపై కేటీఆర్‌ కూడా తనదైన శైలిలో మండిపడ్డాడు. తెలంగాణ అంటే పట్టింపేలేని ప్రధానిని మనం ఎందుకు పట్టించుకోవాలె… ఆ పార్టీని మనమెందుకు ఆదరించాలె.. అంటూ ట్వీట్ చేయడం కూడా పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది.

You missed