ఎల్లారెడ్డి:

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలతో పాటు గాంధారి మండల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ముందుగా… ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్,అధికారులు, ప్రజాప్రతినిధులు,నాయకులు ఘన స్వాగతం పలికారు. మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడే పలువురు నాయకులు కార్యకర్తలు,TNGOS నాయకులతో కలిసి మాట్లాడారు.పలువురి వినతులు స్వీకరించారు.

అనంతరం..ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం మేడిపల్లి వద్ద 14 కోట్లతో బాన్స్ వాడ – ఉప్పలవాయి రిజర్వ్ ఫారెస్ట్ లో డబుల్ రోడ్డు పునరుద్ధరణ పనుల శంకుస్ధాపన,ఎల్లారెడ్డి నియోజక వర్గం సదాశివ నగర్ మండలం పద్మాజీవాడ ఎక్స్ రోడ్ వద్ద 7 కోట్ల 23 లక్షలతో బాన్స్ వాడ ఉప్పలవాయి రోడ్ వయా గాంధారి రోడ్డు పునరుద్ధరణ పనుల శంకుస్థాపన,గాంధారి మండల కేంద్రంలో 45 లక్షలతో అంతర్గత సిసి రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే జాజాలా సురేందర్ తో కలిసి పాల్గొన్నారు.

ఎంపీ బిబి పాటిల్, జెడ్పి చైర్ పర్సన్ ధఫెదార్ శోభ,జిల్లా పార్టీ ప్రెసిడెంట్,ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్,డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.

అనంతరం గాంధారి మండల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మంత్రి వేముల ప్రసంగించారు…

బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. కేసీఆర్ ఎప్పుడూ పార్టీ కార్యకర్తలను విస్మరించలేదనీ,కష్టపడ్డ వారిని కడుపులో పెట్టి చూసుకుంటాడని తెలిపారు. ఉద్యమ సమయంలో కార్యకర్తలు చూపిన తెగువ మరువలేనిదనీ, కష్టపడ్డం కనుకనే రాష్ట్ర ప్రజలు ఆ ఫలాలను అనుభవిస్తున్నారనీ,కార్యకర్తల త్యాగం మరువలేనిదన్నారు. కేసిఆర్ నాయకత్వంలో కార్యకర్తలుగా పనిచేసిన తాము ఎన్నడూ ఎమ్మెల్యేలు,మంత్రులు అవుతామని అనుకోలేదని అన్నారు. అన్నం తినో, అటుకులు బుక్కో నెలల తరబడి కుటుంబాలకు దూరంగా నాయకుడు కేసిఆర్ ఏది ఆదేశిస్తే అది తూచా తప్పకుండా పాటించామని గుర్తు చేసుకున్నారు. పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మలు లాంటివారని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో ఎల్లారెడ్డితో ఉన్న తన అనుబంధాన్ని చెప్పుకొచ్చారు. నియోజకవర్గం నాడు టిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉండేదని,తన తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డితో ఈ ప్రాంతంలో 2001 నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే సురేందర్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారని తెలిపారు. అందరు కలిసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా సురేందర్ నీ ఎన్నుకున్నారని, మరోసారి ఆశీర్వదించి దీవించాలన్నారు. రానున్న రోజుల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

మోడీ దిగి పోవడం ఖాయం…

ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు నరేంద్ర మోడీ అని మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వ్యాపారవేత్త ఆదాని నరేంద్ర మోడీకి బినామి అని అన్నారు. ఆదానికి దోచి పెట్టేందుకే దేశ సంపదను కొల్లగొడుతున్నాడని మండిపడ్డారు. నరేంద్ర మోడీ
అవినీతి అక్రమాలను కెసిఆర్ ఎండగట్టుతున్నందుకే ఈడి తో దాడులు చేస్తున్నాడని, ఎమ్మెల్సీ కవితను ఆడబిడ్డ అని చూడకుండా గంటలకు కొద్ది విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కోట్లను ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసి అడ్డంగా దొరికిపోయిన మోడీ,విచారణ జరిగితే జైలుకు పోతానని భయంతో తన చెప్పు చేతల్లో ఉన్న దర్యాప్తు సంస్థలను ఈ. డి,సిబిఐ పేరిట దాడులకు ఉసిగొల్పుతున్నాడన్నారు. తెలంగాణ మీద నరేంద్ర మోడీ కక్ష కట్టి మనకు రావాల్సిన నిధులు,ప్రభుత్వ సంస్థలు రాకుండా అడ్డుకొంటున్నడని ఆరోపించారు. మోడీ అవినీతి, అక్రమాలను అంతమొందించే వరకు కేసిఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పోరాటం ఆగదని,నరేంద్ర మోడీని దించుడు ఖాయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఇచ్చుడు ఖాయమని మంత్రి స్పష్టం చేశారు. బండి సంజయ్ మాట్లాడేవిఅన్ని లఫంగా మాటలేనని అన్నారు. కేసీఆర్ తెలంగాణలో ఇచ్చే రైతు బంధు పథకాలు ఎందుకు ప్రవేశపెట్టరని?
పంటకు పదివేల రూపాయలు ఎందుకు ఇవ్వరని? రైతులకు ప్రమాద బీమా ఎందుకు వర్తింప చేయరని?మహారాష్ట్ర రైతులు అడుగుతున్నారని..రాష్ట్ర వ్యాప్తంగా ఏకమయ్యి బిజెపి నాయకులకు నిలదీస్తున్నారని అన్నారు. అక్కడి శెట్కరి రైతు సంఘం నాయకులు కేసిఆర్ ను కీర్తిస్తున్నరని అన్నారు. మహారాష్ట్రలో నేడు అగ్గి పుట్టింది కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కావాలని దేశ వ్యాప్తంగా గ్రామాలకు గ్రామాలు తరలివస్తున్నాయన్నారు.

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్…

రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్,బ్లాక్ మెయిలర్, బుడ్డర్ ఖాన్,ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయిన దొంగ అని మంత్రి వేముల.. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నోటికి ఏది వస్తె అది మాట్లాడుతున్న రేవంత్ తన నాయకుని ఎంపి పదవి ఊడగొడితె మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. సున్నాలు వేసుకుని బ్రతికే రేవంత్ రెడ్డికి బంజారాహిల్స్ లో బంగ్లా,వేల కోట్ల ఆస్తులు,కాన్వాయ్ వాహనాలు ఎక్కడివి అని ప్రశ్నించారు. కేసిఆర్,కెటిఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

You missed