జ‌ర్న‌లిజం ప‌నైపోయిందీ, ప్రింట్ మీడియా అయితే దాదాపు చ‌చ్చిపోయింది అనే మాటలు మీడియా స‌ర్కిళ్ల‌లో నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఇదే సాకుతో కొన్ని మీడియా సంస్థ‌లు ఎంతో మంది ఉద్యోగుల‌ను తొల‌గించాయి. అలాంటి వాటిలో న‌మ‌స్తే తెలంగాణ ఒక‌టి. ఈనాడు తీసేసింద‌ని, సాక్షి తీసేయ‌బోతుంద‌ని కుంటిసాకులు చెప్పి కంట్రిబ్యూట‌ర్ల నుంచి మొద‌లుకుని స్టాఫ్ రిపోర్ట‌ర్లు, స‌బ్ ఎడిట‌ర్లు, స‌ర్క్యులేష‌న్ సిబ్బంది, ఆఖ‌రికి ఆఫీస్‌బాయ్‌ల‌ను కూడా తీసేసిన ఘ‌న‌త న‌మ‌స్తే తెలంగాణ ఎడిట‌ర్ కృతిది. అంతాబాగ‌నే ఉందిగానీ అయ్య‌వారు కొత్త‌గా కొంత‌మంది కంట్రిబ్యూట‌ర్ల‌ను రిక్రూట్ చేసుకున్నాడ‌ని మీడియా స‌ర్కిల్స్‌లో టాక్ న‌డుస్తోంది.

అందుకోసం భారీగా ముడుపులు అందాయ‌ట‌. కంట్రిబ్యూట‌ర్ల‌ను రిక్రూట్ చేసుకోవ‌డంలో ముడుపుల బేరం బ్యూరో రిపోర్ట‌ర్‌, స్టాఫ‌ర్ల ప‌రిధిలో స‌ర్వ‌సాధార‌ణ‌మే. అయితే న‌మ‌స్తే తెలంగాణ‌లో ఓ కంట్రిబ్యూట‌ర్‌ను పెట్టుకోవ‌డానికి నేరుగా ఎడిట‌రే రంగంలోకి దిగాడ‌ట‌. అయ్య‌వారు ఏ పావ‌లో ప‌ర‌కో తీసుకునే ర‌కం కాదు క‌దా. అక్ష‌రాలా ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు కావాల్సిందే అని డిమాండ్ చేశాడ‌ట‌. కాబ‌ట్టి చేసేదేమి లేక స‌ద‌రు కంట్రిబ్యూట‌ర్ కాద‌న‌కుండా ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌లు స‌మ‌ర్పించుకున్నాడ‌ని బ‌య‌ట బ‌హిరంగ చ‌ర్చ జ‌రుగుతోంది.
ఇంత‌కూ ఆ 10 ల‌క్ష‌ల రూపాయ‌ల డీల్ ఎలా కుదిరిందంటే..

హైద‌రాబాద్ శివారులో ఒక ఏరియాకు కంట్రిబ్యూట‌ర్‌గా చేసే న‌మ‌స్తే తెలంగాణ విలేక‌రి దుర‌దృష్ట‌వ‌శాత్తు క‌రోనా సెకండ్ వేవ్‌లో చ‌నిపోయాడు. చాలాకాలం ఆ స్థానం ఖాళీగానే ఉన్న‌ది. అయితే హైద‌రాబాద్ జిల్లా రిపోర్ట‌ర్‌కు తెలిసిన ఒక వ్య‌క్తితో ఆ ప్లేస్‌ను భ‌ర్తీ చేశారు. కానీ అత‌డు ఎక్కువ‌కాలం ఉండ‌లేదు. కొంత‌కాలం ఆ ప్లేస్‌ను ఎవ‌రినీ భ‌ర్తీ చేయ‌కుండా పెండింగ్‌లో పెట్టారు. అదే స‌మ‌యంలో అదృష్టం కృతి త‌లుపు త‌ట్టింది. ఆ డేట్‌లైన్ మీద క‌న్నేసిన కంట్రిబ్యూట‌ర్ ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తాన‌ని ఆఫ‌ర్ చేశాడ‌ట‌. దీప‌మున్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవాల‌నుకునే కృతి ఆ ఆఫ‌ర్‌ను ఎందుకు తిర‌స్క‌రిస్తాడు? దొరికిందే ఛాన్స్ అనుకొని బ్యూరో రిపోర్ట‌ర్‌తో డీల్‌కు దిగాడ‌ట‌. రూ.10ల‌క్ష‌లు ఇస్తే రేప‌టి నుంచే వార్త‌లు రాసుకోవ‌చ్చ‌నే భ‌రోసా క‌ల్పించ‌డంతో స‌ద‌రు కంట్రిబ్యూట‌ర్ సింగిల్ పేమెంట్ చేసి మ‌రుస‌టి రోజు నుంచి విధుల్లో చేరాడు.

అత‌డు అప్ప‌టికే ఓ ప్ర‌ధాన దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేస్తూ భూ క‌బ్జా విష‌యంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొని, ఆ విష‌యం పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కూ వెళ్లింద‌ట‌. న‌మ‌స్తే తెలంగాణ‌లో చేరితే ఈ ఉచ్చులో నుంచి ఈజీగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు అనే ఆలోచ‌న‌తో రూ.10 ల‌క్ష‌ల లంచం ఇచ్చి చేరాడ‌ని తెలుస్తోంది. ఎవ‌రినైనా ఉద్య‌గంలోకి తీసుకునే విష‌యంలో అత‌డి పూర్వ చ‌రిత్ర‌, ప‌నిత‌నం చూసిన త‌ర్వాతే రిక్రూట్ చేసుకుంటారు. అయితే ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల ఆఫ‌ర్ వ‌చ్చేస‌రికి కృతి ఇవేవీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ఉద్యోగం ఇచ్చాడు. ప‌ది ల‌క్ష‌లు లంచం ఇచ్చి చేరిన‌వాడు పేప‌ర్‌ను అడ్డంపెట్టుకొని కోట్ల రూపాయ‌లు ఎందుకు సంపాదించడు అనే స్పృహ కృతికి లేక కాదు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా అలా చేసి ఉంటాడు. పేప‌ర్ పేరు డ్యామేజీ అయినా స‌రే కృతి మాత్రం త‌న వికృత తాండ‌వాన్ని కొన‌సాగిస్తూనే ఉన్నాడు. లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ అధికారి అని తాటికాయ ముంజ ప‌రిమాణంలో శీర్షిక‌లు పెట్టే కృతి, తాను చేసింది ఏమ‌నుకుంటున్నాడో ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి.

నమస్తే తెలంగాణ ఎడిటర్‌ కృతి బాధిత సంఘం..

You missed