నమస్తే తెలంగాణలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మొన్న స్టేట్ బ్యూరో నుంచి సీనియర్‌ రిపోర్టర్ కోటిరెడ్డి రాజీనామా చేసి వెళ్లిపోగా.. తాజాగా సెంట్రల్‌ డెస్క్‌లో సెకండ్‌ ఇన్చార్జిగా ఉన్న సంతోష్‌ రాజీనామా చేశాడు. సెంట్రల్‌ డెస్క్‌ ఇన్చార్జిగా జగన్‌ వ్యవమరిస్తున్నాడు. ఇతనూ రేపోమాపో రాజీనామా చేసి వెళ్లిపోయేందుకు రెడీ అయ్యాడు. చీఫ్ ఆర్టిస్ట్‌ భాను కూడా రాజీనామా చేయనున్నాడు. ఎడిటర్‌ తీగుళ్ల కృష్ణమూర్తి వేధింపులు, అవమానాలు తట్టుకోలేక వీరంతా రాజీనామాల బాట పడుతున్నారు. ఇప్పుడిది హైదరాబాద్‌ మీడియా సర్కిళ్లలో చర్చకు తెర తీసింది. ఎడిటర్‌గా తీగుళ్ల చేరిన నాటి నుంచి పత్రిక పరువు బజారుకెక్కింది.

ఎంతో కాలంగా దీన్నే నమ్ముకున్నవారిని రోడ్డుపాలు చేసిన తీగుళ్ల… ఆ తర్వాత క్రమంగా పత్రికపై గుత్తాధిపత్యం చెలాయించడం మొదలుపెట్టాడు. కేసీఆర్, కేటీఆర్, కవిత.. వీరి మాట కూడా అక్కడ చెల్లుబాటు కాదు.నమస్తేను నమ్ముకున్నవాళ్లను నట్టేట ముంచిన తీగుళ్ల… ఆంధ్రజ్యొతి టీమ్‌తో అక్కడ రాజ్యమేలుతున్నాడు. చూసీ చూసీ విసిగి వేసారి పోయిన ఉద్యోగులు ఒక్కొక్కరు దీన్నుంచి నిష్క్రమిస్తున్నారు. పత్రికకు సెంట్రల్‌ డెస్క్‌ కీలకం. గుండెకాయ లీలాంటిది. అలాంటి సెంట్రల్‌ డెస్క్‌లో ముఖ్యమైన ఇద్దరు ఇన్‌చార్జిలు రాజీనామా చేస్తున్నారు. ఇది ఇంకా ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు.

You missed