జాతీయరాజకీయాలు చేయాలని కేసీఆర్ తలంచిన ముహూర్తం, సమయం, సందర్భం బాగున్నట్టుంది. బీజేపీకి ఎదుర్కొని ఢికొట్టే మొనగాడు ఎవరూ లేకపోవడం కూడా కలిసి వచ్చినట్టుంది. బీఆరెస్‌కు నామకరణం.. ఇక రంగంలోకి దిగేందుకు రెడీ.. సరిగ్గా ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక… ఇక రా చూసుకుందాం బరిలోని కేసీఆర్ తొడగొట్టేలోపే… బీజేపీ దొంగలు అడ్డంగా దొరికారు. నలుగురు టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రంగంలోని దిగిన ముగ్గురు బ్రోకర్ల రియార్టీ షో కేసీఆర్ చేతికి చిక్కింది. ఇంకేముంది..? ఇదే రోజు మునుగోడు పోలింగ్ ముగిసింది.అక్కడ టీఆరెస్ బంపర్ మెజార్టీతో గెలవనుంది.
అక్కడ దెబ్బ కొట్టి బీఆరెస్‌కు మంచి బోణీ సంపాదించిన కేసీఆర్… ఇక అదే ఊపుతో రాత్రి 8 గంటలకు ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోలు విడుదల చేసి బీజేపీ బట్టలిప్పాడు. ఒకటి కాదు రెండు కాదు.. వీడియో ల మీద వీడియోలు.. చూడటానికి కళ్లు చాలవు…. అసలు సమమయే చాలదు. అంతలా ఉన్నాయవి. మంచిగా జీవించారు. ఎక్కడా నటన లేదు. అంతా నాచురల్. అందుకే వీడియోలు హిట్ అయ్యాయి. వైరల్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాలాగా రిలీజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీడియాకు చేతినిండా పని కల్పించాయి.
తడిబట్టలతో యాదాద్రి…మిమిక్రీ…. కేసీఆర్ గేమ్ అంటూ నంగనాచి కబర్లు చెప్పిన బీజేపీ పెద్ద తలకాలయంతా ఇప్పుడా తలలు ఏ సీసీ కెమెరాలకు అడ్డంగా పెట్టుకుంటారో.. ఏ డబ్బుల సంచుల్లో తలదాచుకుంటారో. చీ అంటే చిత్తపురం కాడా కుక్క బాయిలపడి చచ్చిందంట. ఇదో సామెత తెలంగాణల. కానీ ఈ బీజేపీ వాళ్లకు సిగ్గు, శరం ఉంటే కదా…. పైగా ఓ ట్యాగ్ లైన్ ఉండనే ఉంది. ఉంచిన ఉమ్మును తుడుచుకుని పోవడానికి
అదే…
ధర్మం కోసం…
దేశం కోసం….