రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలే ఉంటాయి. బూర నర్సయ్యగౌడ్ ఇప్పుడు చేసిందదే. ఆత్మగౌరవం, అవమానం, బానిస బతుకు అని ఏవేవో మాట్లాడి బీజేపీలోకి జంప్ అయ్యేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. బాగానే ఉంది. కానీ అక్కడ బీజేపీలో ఈయన అడిగిన డిమాండ్లు పట్టించుకున్నవాడు లేడట. ఎంపీ కావాలన్నాడు. నో అన్నారు. ఎమ్మెల్యే అయిన ఇస్తారా …. వేడుకున్నాడు. కాదు పోపోమన్నారు. ఏదో ఒక కార్పొరేషన్ ఇస్తాం లేవయ్యా… సరే..అదీ కాదంటే ఎమ్మెల్సీ చేస్తం తియ్… ఊకే సతాయించకు అన్నారట. దీంతో బూర నోరు బార్లా తెరిచాడంట. ఇప్పుడు మళ్లీ టీఆరెస్‌లోకి పోలేడు. బీజేపీలో చేరుదామంటే అనుకున్న ఆత్మగౌరవం ఇచ్చేటట్టు లేరు. బీసీ కార్డు వాడుకుంటే ఇలా వేస్ట్ అయిపోయిందేందబ్బా..అని తెగ ఆవేదన పడుతున్నాడట. చౌరస్తాలో ఉండి దిక్కులు చూస్తున్నాడంట.. ఎటుపోవాల్నో అని….