బీజేపీ శ్రేణుల్లో భ‌యంప‌ట్టుకుంది. ఇక్క‌డ కేటీఆర్ బాధ్య‌త తీసుకున్న త‌ర్వాత టీఆరెస్ ఓట‌మి చెందే ప్ర‌స‌క్తే లేద‌నే విధంగా వారు ఇప్ప‌టికే ఓ అభిప్రాయానికి వ‌స్తున్నారు. టీఆరెస్‌ను ఢీ కొట్టాలంటే ఈ స్టామినా స‌రిపోద‌ని, ఇంకా పెంచాల‌ని వారు సూచిస్తున్నారు. నామినేష‌న్ల ఘ‌ట్టం పూర్త‌యికాక‌ముందే … అప్పుడే ఓ ర‌కంగా బీజేపీ త‌న ఓట‌మిని అంగీక‌రిస్తున్న‌ది. కేటీఆర్ దీన్ని ఇజ్జ‌త్‌కా స‌వాల్‌గా తీసుకోవ‌డం….అక్క‌డ పార్టీ గెలిచే అవ‌కాశాలు మెండుగా ఉండ‌టం… చూస్తే బీజేపీ గెలుస్తుంద‌నే ఆశ లేన‌ట్టేన‌నేది ఆపార్టీ అభిమానులు అనుకుంటున్న మాట‌….
………………………………………………………………

అక్కడ TRS తరపున బాధ్యత KTR తీసుకొని ఆయనే ముందుండి నడిపిస్తున్నాడు…. దుబ్బాక,హుజురాబాద్ లలో ఈ బాధ్యత హరీష్ రావు మీద ఉండే…ఎందుకంటే అక్కడ మొదలు నుంచి TRS కు రిపోర్ట్ తెలుసు ఓడిపోబోతున్నాం అని అందుకే అక్కడ KTR కు బదులు హరీష్ రావు కు ఇచ్చి నెపం ఆయన మీదకు పోయేటట్టు అయ్యింది…

కానీ ఇక్కడ హరీష్ రావు ను కాదని KTR భుజాల మీద వేసుకున్నాడు అంటే ఇక్కడ కొద్దిగా ఎడ్జ్ TRS కు ఉన్నది గెలిస్తే అది KTR ఖాతాలో పడుతుంది అనే ఉద్దేశ్యంతో…

కాబట్టి ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నది కావున బీజేపీ సర్వ శక్తులు ఒడ్డాలి….!!!
…………………………………………………………………………………………………………

Katpally Santhosh Reddy అనే క‌రుడుగ‌ట్టిన బీజేపీ అభిమాని అభిప్రాయం ఇది. బీజేపీకి ఇప్పుడున్న‌ది గెలుపు ధీమా కాదు.. ఓట‌మి భ‌యం అని ఓపెన్‌గానే చ‌ర్చించుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా…

 

You missed