Month: September 2022

స‌న్నీ, పాయ‌ల్ ఉంటే న‌న్నెవ‌డు చూస్తాడు… క‌రెక్ట్‌గా చెప్పావు మంచు విష్ణు.. నిన్ను చూడ‌టం ఏనాడో మానేశారు.. నీ సినిమాలు న‌డ‌వాలంటే ఇలాంటి గ్లామ‌ర్ ఉండాల్సిందే.. ఫోర్న్ స్టారూ అవ‌స‌ర‌మే…

నాన్న హీరో అయినంత మాత్రాన తామూ అదే వార‌స‌త్వాన్ని అందుకుంటామ‌ని, ఏళ్ల త‌ర‌బ‌డి వెండి తెర‌ను ఏలేద్దామ‌నుకుని వ‌స్తారు కొంద‌రు.ఇదే కోవ‌లోని వాడు మంచు విష్ణు. అత‌న్ని ఏనాడో ప్రేక్ష‌కులు చూడ‌టం మానేశారు. అయినా తీస్తూనే ఉన్నాడు. డైలాగ్ డెలివ‌రీ స‌రిగా…

మంచిగా చ‌దువుకో.. నేనున్నాను… తండ్రిని కోల్పోయిన గిరిజ‌న బాలుడికి భ‌రోసానిచ్చిన బాజిరెడ్డి జ‌గ‌న్….

ఈ బాలుడి పేరు వివేక్ రాజ్‌. గిరిజ‌నుడు. తండ్రి అకాల‌మ‌ర‌ణం పొందాడు. గుండెపోటుతో. అమ్మ‌మ్మ‌, తాత ఆల‌నాపాల‌నే దిక్క‌య్యింది. మోపాల్ మండలంలోని అమ్ర‌బాద్ తండాలో ఓ ప్రైవేటు స్కూల్‌లో నాలుగో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. ఆ బాలుడి తాత‌…. బాజిరెడ్డి జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు…

అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దం…దీనికి వ్యతిరేకంగా దళిత బహుజన ప్రజలు ఉద్యమించాలి.. ఇందూరు వేదిక‌గా ఉద్య‌మానికి బీఎఎల్ఎఫ్ రౌండ్‌ టేబుల్ సమావేశంలో పిలుపు..

ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు, అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోడీ నేత్రత్వం లోని బిజెపి ప్రభుత్వం “103 వ రాజ్యాంగ సవరణ చట్టం -2019″తీసుకువచ్చిందని అది రాజ్యాంగ స్పూర్తికి పూర్తి విరుద్ధమని బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి…

బీడీ పింఛ‌న్ క‌టాఫ్ డేట్ ఎత్తివేత ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకే… క‌రీంన‌గ‌ర్‌ను లిస్టులో చేర్చ‌ని ప్ర‌భుత్వం.. నిర్మ‌ల్‌కు ఓకే…

బీడీ క‌టాఫ్ డేట్ నిబంధ‌న‌ను ఎత్తివేసిన ప్ర‌భుత్వం .. దీన్ని కేవ‌లం నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాకే ప‌రిమితం చేసింది. వాస్త‌వంగా బీడీ కార్మికులు ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో కొంత మేర ఉన్నారు. వీరంద‌రికీ ఇది వ‌ర్తించాలి.…

అంచ‌నాలు త‌ల్ల‌కిందులు… ఇందూరు కొత్త క‌లెక్ట‌రేట్ వ‌ద్ద వంద‌ల ఎక‌రాలకు అమాంతం పెరిగిన రేటు.. క‌లెక్టరేట్ ప్ర‌తిపాద‌న‌కు ముందు ఇక్క‌డ ఐదువేల గ‌జం.. ఇప్పుడు 50వేలు.. కొనుగోళ్లు లేవు.. నిర్మాణాలు లేవు..

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కొత్త క‌లెక్ట‌రేట్ ఆమ‌డ‌దూరం. ర‌వాణా సౌక‌ర్యం లేదు. అంతా కొత్త‌. ప్ర‌జావాణి కోసం ప్ర‌తి సోమ‌వారం అక్క‌డికి పోవాలంటేనే జ‌నాలు నానా తంటాలు ప‌డుతున్నారు. ఇంకా అల‌వాటు కాలేదు. అది ఓపెనింగ్ అయిన త‌ర్వాత ఒక్క‌డ రియ‌ల్…

తీన్మార్ మ‌ల్ల‌న్న‌తో న్యాయ‌వాది ఫోటో… వివాద‌స్ప‌దం.. ప్ర‌భుత్వ ప్లీడ‌ర్ కోసం లిస్టులో పేరున్న న్యాయ‌వాది కావ‌డంతో నిజామాబాద్‌ న్యాయ‌వాదుల స‌ర్కిల్‌లో ఇప్పుడిదే చ‌ర్చ‌….

తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్‌… ఇవాళ నిజామాబాద్ కోర్టుకు హాజ‌ర‌య్యాడు .. పాత కేసులో. కొంద‌రు న్యాయ‌వాదులు అత‌నితో ఫోటోలు దిగారు అభిమానంతో. ఈ ఫోటోలు దిగిన‌వాటిలో ఒక‌టి మాత్రం వివాద‌స్ప‌ద‌మైంది. ప్ర‌భుత్వ ప్లీడ‌ర్ కోసం జాబితాలో పేరున్న జ‌గ‌దీశ్వ‌ర్‌రావు…

బీడీ పింఛ‌న్ క‌టాఫ్ డేట్ ఎత్తివేత‌.. ఇక పై పీఎఫ్ నెంబ‌ర్ ఉంటే చాలు ఆస‌రాకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం… రెండ్రోజుల్లో ఉత్త‌ర్వులు…

“వాస్త‌వం”… ఎక్స్‌క్లూజివ్‌.. www.vastavam.in ………………………………………………………………………………. ఎన్నాళ్ల నుంచో ఆస‌రా పింఛ‌న్ కోసం ఎదురు చూస్త‌న్న బీడీ కార్మికుల‌కు ఇది శుభ‌వార్త‌. ప్ర‌భుత్వం బీడీ కార్మికుల‌కు జీవ‌న భృతి కింద ఆస‌రా పింఛ‌న్‌ను అందిస్తున్న‌ది. దీనికి మొన్న‌టి వ‌ర‌కు ఓ క‌టాఫ్ డేట్‌ను…

మ‌ధుయాష్కీ తిన్నింటి వాసాలు …… రేవంత్‌పై కోపంతో కాంగ్రెస్ డేంజ‌ర్‌లో ఉంద‌ని టీవీల‌కు ఇంట‌ర్వ్యూ… ఇన్చార్జి మాణిక్కం పై నిప్పులు… మీలాంటి నేత‌ల‌తోనే కాంగ్రెస్ ప‌రిస్థితి ఇలా త‌యార‌య్యింది…

మ‌ధుయాష్కీ కూడా తిన్నింటి వాసాలు లెక్క‌బెట్టే లిస్టులో చేరిపోయాడు. ఒక‌ప్పుడు పార్టీ ద్వారా ప‌ద‌వులు అనుభ‌వించి కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన నేత‌లు ఇప్పుడు పార్టీ క‌ష్ట‌కాలంలో ఉంటే దాన్ని మ‌రింత అనాథ‌ను చేసి మాట్లాడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా మ‌ధుయాష్కీ కూడా చేరాడు.…

కేటీఆర్ చేతిలో అదుపుత‌ప్పిన టీఆరెస్ పార్టీ స్టీరింగ్‌… జిల్లా అధ్య‌క్షులుగా ఎమ్మెల్యేను నియ‌మించ‌డం బ్లండ‌ర్ మిస్టేక్‌…. జిల్లా క‌మిటీలు, అనుబంధ సంఘాల క‌మిటీల దిక్కులేదు.. ప‌ట్టింపులేదు… పార్టీ ప‌ద‌వులూ లేక తీవ్ర అసంతృప్తిలో నేత‌లు…

కేటీఆర్‌కు పార్టీ ప‌గ్గాలివ్వ‌గానే ఏదో అవుతుంద‌నుకున్నారు. ఇంకేదో చేస్తాడ‌నుకున్నారు. యువత‌కు మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌నుకున్నారు. పార్టీ బ‌లోపేతంలో, సంస్క‌ర‌ణ‌లో త‌న‌దైన ముద్ర‌వేస్తాడ‌నుకున్నారు. కానీ అదేదీ జ‌ర‌గ‌లేదు. ఇంకా ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యార‌య్యింది. నామినేటేడ్ ప‌ద‌వుల కోసం వేచి చూసి చూసీ…

అక్క భ‌రోసా లేక ఇందూరు టీఆరెస్ అనాథ‌… ప‌దవుల్లేవు… ప‌ట్టింపులేదు.. ప‌ట్టించుకునేవారు లేరు.. ఏళ్లుగా నిరీక్ష‌ణ‌.. హామీల‌తోనే కాలం వెళ్ల‌దీస్తున్న నేత‌లు..

ఇందూరు జిల్లా అంటేనే క‌విత‌క్క అడ్డాగా భావిస్తారు. ఇక్క‌డ ఎమ్మెల్యేలంతా ఆమె స‌మ‌న్వ‌యంలోనే ప‌నిచేస్తారు. అంతిమంగా పార్టీని బ‌లోపేతం చేయాలి. టీఆరెస్‌కు ఇందూరు కంచుకోట అనే పేరును సార్థ‌కం చేస్తూ సాగాలి. అంద‌రినీ ఆదుకోవాలి. అంద‌రికీ అవ‌కాశాలివ్వాలి. అంద‌రూ బాగుప‌డాలి. పార్టీని…