ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితకు లింకులున్నాయంటూ బీజేపీ చేసిన ఆరోపణలు….హైదరాబాద్‌లోని కవిత ఇంటి పై బీజేపీ నేతల దాడులపై టీఆరెస్ భగ్గుమున్నది. ఆమెకు వెల్లువలా మద్దతు లభిస్తున్నది. పరామర్శల వెల్లువ కొనసాగుతుంది. బీజేపీ ఆడేది బ్లేమ్ గేమ్ అని దీన్ని తిప్పికొట్టేందుకు మేం రెడీగా ఉన్నామనే సంకేతాలిచ్చింది గులాబీ దళం. నిన్న కవిత నివాసానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్ తదితరులు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఆమె నివాసానికి పెద్ద ఎత్తున టీఆరెస్ శ్రేణులు తరలివచ్చారు. మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇవాళ టీఆరెఎస్ ఎల్పీలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ పెట్టి దీన్ని ఖండించనున్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి నిన్ననే కవితపై దాడి, ఆరోపణలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. బీజేపీ కవితను బ్లేమ్ చేసే విషయంలో నాటకం ఆడుతున్నదని దీన్ని తిప్పికొట్టి ఆమెకు సంఘీభావంగా ఉండేందుకు ఆమె నివాసానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా టీఆరెస్ శ్రేణులు తరలివస్తున్నారు. కవిత ఇంటిపై బీజేపీ దాడి చేయడాన్ని సర్వత్రా తప్పుబడుతున్నారు.