రైతు బద్నాం ధర్నా
బీజేపీ ధర్నాపై రైతన్న కుతకుత
బెంజి కారు బోర్డుకు ‘ఊ’ అనలేదు. … బాండ్ రాసిచ్చి కూడా ‘ఉఊ’ అన్నావు.
ఒప్పుకుంటే పాదయాత్ర ఎందుకు చేశామంటావ్…?
మా నామినేషన్లు నీ అబద్దాల బాండ్ పేపర్‌లా కాదు… ఎన్నికల్లో పోటీ చేసిన రైతులు, ‘ఐక్య’ నాయకుల్లో ఆవేదన
మల్లిఖార్జున్‌లోనూ అర్వింద్ ‘బాండ్’ మార్కు….
‘ఉ’ అంటావా…? మావా ఉఊ’ అంటావా..?? మావా పాట చందంగా మారిపోయింది ఎంపీ ధర్మపురి అర్వింద్ బాండ్‌పేపర్ హామీ రాజకీయం. పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి ఎంపీగా గెలిచాకా పసుపు బోర్డు తేలేకపోయాడు అర్వింద్. ఫలితంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిలదీతలు ఎదుర్కుంటూ వస్తున్నాడు అర్వింద్. ఈ పరిస్థితుల్లో స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీసు తెచ్చానని అది పాతకాలం నాటి అంబాసిడర్ కారులాంటిది కాదని, సరికొత్త బెంజి కారు లాంటిదని కొత్త పాటు అందుకున్నాడు అర్వింద్. రైతులేమో అంబాసిడర్ లాంటి పసుపుబోర్డే కావాలని తేల్చి చెబుతూ వస్తున్నారు. కానీ అర్వింద్ మాత్రం అదే పాటపాడుతూ రెండున్నరేండ్లుగా బెంజికారు లాంటి ఆఫీసు కోసం ఊ అంటావా….. ? రైతన్నా.. ! ఉఊ అంటావా..?? రైతన్న అంటూ రాగం తీస్తూంటే … ఉఊ అనే సమాధానమే ఇస్తున్నారు రైతులు.
వేల్పూర్ ఎక్స్ రోడ్డులో అర్వింద్ మాట్లాడుతూ… పసుపు బోర్డు కు బదులు బెంజికారు లాంటిదానికే రైతులు సరేనన్నారు అని చెప్పుకున్న విషయాన్ని తప్పుబడుతున్నారు. తాము సరేనని ఎక్కడన్నాము..? ఎప్పుడన్నాము..?? అని ప్రశ్నిస్తున్నారు. సరేనంటే రైతులు, నీ ఎన్నికలప్పుడు నామినేషన్ వేసిన రైతులు , పసుపు బోర్డు సాధన కోసం పోరాడుతూనే ఉన్న ఐక్యవేదిక నాయకులు మొన్నకాక నిన్నటి దాకా బోర్డు కోసం పాదయాత్రలు ఎందుకు చేశారంటావు..? సమాధానం చెప్పు అంటున్నారు.
ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నది కదా.. అలాంటప్పుడు రైతులు సరేనన్నారని ఎలా చెప్పుకుంటావు..? అనే ప్రశ్నలు, నిలదీతలు మొదలయ్యాయి. అర్వింద్ రైతు దీక్ష పెట్టుకున్నది రైతులను , నామినేషన్ వేసిన రైతులను , ఐక్య వేదిక నాయకులను ఇలా బద్నాం చేసేందుకేనా..? అన్న చర్చ షురూ అయ్యింది. రైతు ధర్నా మమ్మల్ని బద్నాం చేసే ధర్నాగా వాడుకున్నందుకు మేము కూడా ఊ అనలేదే అన్న… ఉఊ అన్నామే అన్నా… అంటూ మరోసారి ధర్నానో లేదా పాదయాత్రనో పెట్టుకోక తప్పేట్టు లేదే అన్నా… అంటున్నారు.
అర్వింద్ మాటలకు వంతపాడిన మల్లిఖార్జున్ రెడ్డికి అబద్దాల బాండు మార్కు అబ్బుతున్నదనే విమర్శలు మొదలయ్యాయి.
DANDUGULA SRINIVAS