నమస్తే…

నమస్తే తెలంగాణ పత్రిక పై
మీరు రాస్తున్న వాస్తవ కథనాలు
కళ్లకు కట్టినట్లు చూపించారు.
మీరు అందిస్తున్న కథనాలు, సాహసో పేతం. అందుకు మీకు కృతజ్ఞ‌తలు. మీరు ఇంత రాస్తున్నా వానిలో మార్పు రావడం లేదని పిస్తుంది. పత్రిక వార్షికోత్సవం పేరిట రిపోర్టర్లకు విపరీతమైన అడ్వటైజ్ మెంట్ టార్గెట్ పెట్టి చేస్తావా పోతావా అంటూ ఇబ్బందులు పెడుతున్నారు. రిపోర్ట‌ర్లు మానసిక ఒత్తిడిని తట్టు కొలేక పోతున్నారు.
పత్రిక కరపత్రం అంటూ అధికార పార్టీ నేతలే వేసుకోరు. మా వార్తలే రావు. మీ పేపర్ మేమెందుకు వేసుకోవాలి..? అంటూ ప్రతిపక్ష పార్టీలు, ఇటు స్వంత పార్టీ నేతలు యాడ్ లు ఇవ్వరు. బయట ఎవ్వరూ విలువ ఇవ్వరు. ఈ పరిస్తితిలో టార్గెట్ ఏలా చెయ్యాలి…? అడకత్తెరలో పోక లా రిపోర్టర్లు నలిగి పోతున్నారు.

తిరుపతి.. పాలమూరు

You missed