సమస్తం నేనే.. నినే చెప్పిందే వేదం… నేను ఎవరి మాట వినను.. నా బాస్ కేవలం కేసీఆర్ మాత్రమే…. ఎం.డి కేవలం జీతాలు ఇస్తున్నాడు కాబట్టే నేను గౌరవిస్తా.. ఎవరినీ ప‌ట్టించుకోను. నేను మోనార్క్‌ను అనే సంకేతాలు ఇప్పటికే నమస్తే తెలంగాణ ఉద్యోగుల‌కు ఇన్‌ డైరెక్ట్ గా పంపించాడు తన వ్యూహం అమలు చేయడంలో సక్సెస్ అయిన నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుల్ల కృష్ణమూర్తి. ఆ సార్ కన్ను ఇప్పుడు తెలంగాణ పబ్లికేషన్ డైరెక్టర్ ప‌ద‌విపై పడింది. నమస్తే తెలంగాణ ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు వ్యూహంలో భాగంగా అన్నింటిలో పనులు చక్కపెట్ట‌డంలో సక్సెస్ అయ్యాడు.

ఎప్పటికైనా డైరెక్టర్ కావాలనే తన చిరకాల వాంఛను సన్నిహితుల ద్వారా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నమస్తే తెలంగాణ ను కబళించిన K.M నెమ్మదిగా టీ న్యూస్ లో వేలు పెట్టడం మొదలుపెట్టాడు. తన సామాజిక వర్గానికి చెందిన హెడ్‌వోడీల‌ను టీ న్యూస్ లో నియమించడంలో సఫలీకృతుడయ్యాడు. ఇప్పటికే నమస్తే తెలంగాణ పత్రికలో తన వారిని నియమించడం.. అటు టీ న్యూస్ లో తన వారిని నిర్మించడంలో సఫలం అయ్యాడు. తెలంగాణ పత్రికలో ప్రారంభం నుంచి కరుడుగట్టిన తెలంగాణ వాదులను అర్థంలేని ఆరోపణలు చేసి వారిని అవమానకర రీతిలో సంస్థ‌ను బ‌య‌ట‌కు పంపించాడు. న‌మ‌స్తే తెలంగాణ, టీ న్యూస్ లో తాను పట్టపగ్గాలు లేకుండా చేసుకున్నాడు. ఇరు సంస్థలలో పట్టు సాధించడం తో నెమ్మదిగా ఇప్పుడు సార్ గారు కన్ను డైరెక్టర్ పై పడింది.

నమస్తే తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ దామోదర్ రావు ను టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు పంపించింది. ఇదే అదునుగా భావించిన కృష్ణమూర్తి ఎం.డి దామోదర్ రావు ఇకపై పత్రిక కు టైం కేటాయించలేడని.. నెమ్మది నెమ్మదిగా ప్రచారం మొదలుపెట్టాడు. ఇప్పటికే తన సన్నిహితుల తో విష ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. సీఎం కు నాపై అపారమైన నమ్మకం ఉందని, తాను ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పత్రిక అద్భుతంగా వస్తుందని రోజు రోజుకు సర్కులేషన్, అడ్వర్టైజ్మెంట్స్ దిన దిన ప్రవర్తమానంగా వెలుగుతుందని తన స్నేహితులు ద్వారా ప్రచారం జరిపిస్తున్నాడు. డైరెక్టర్ అయితే నమస్తే తెలంగాణ, టీ న్యూస్ లో తను ఆడింది ఆట.. చెప్పిందే వేధంగా ఉండటంతో తెలంగాణ పత్రిక వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.

ఇదే జరిగితే తెలంగాణ ఉద్యమంలో రెపరెపలు ఆడిన నమస్తే తెలంగాణ తిరోగమన దిశలో పయనిస్తుంద‌న‌డంంలో ఎలాంటి సంశయం లేదు.. వచ్చేది ఎన్నికల సమయం. పోటీ పార్టీలను ఎదుర్కోవాలంటే తెలంగాణ లో జరిగిన నిజమైన అభివృద్ధిని, పార్టీ లోపాలను ఎత్తిచూపే ఎడిటర్ కావాలి… ఇదే ఎడిటర్ ను కొన‌సాగిస్తే వచ్చే ఎన్నికల్లో కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లే. ప‌త్రిక‌ను చదువుతున్న తెలంగాణ వాదుల్లో ఉదయిస్తున్నప్ర‌శ్న ఇది.

V.J.Nandan

You missed