ఓ పిల్లి ఓ ఇంట్లోకి ప్ర‌వేశించింది.

ఆ ఇంట్లోని ఎలుక‌ల‌ను ఒక్కొక్క‌టిగా వేటాడి తినేయ‌డం మొద‌లుపెట్టింది. దాని ఆక‌లికి రోజుకొక‌టి బ‌ల‌వుతూ వ‌స్తున్న‌ది. బ‌క్క పిల్లి ఎలుక‌ల‌ను తినీతినీ బ‌లిసిపోతున్న‌ది. ఎలుక‌ల సంఖ్య త‌గ్గిపోతూ వ‌స్తున్న‌ది. వాటిలో ఆందోళ‌న మొద‌లైంది. “ఎలా? దీన్నుంచి త‌ప్పించుకోవ‌డ‌మెలా? ప్రాణాలు కాపాడుకోవ‌డ‌మెలా? ”

ఓ రోజు అవ‌న్నీ స‌మావేశ‌మ‌య్యాయి. దీనిపై సుధీర్ఘంగా చ‌ర్చించాయి. ఎలాగైనా పిల్లి పీడ విర‌గ‌డ కావాల‌ని గ‌ట్టిగా ఆకాంక్షించాయి. దాన్నుంచి త‌మ ప్రాణాలు కాపాడుకోక‌పోతే త‌మ ఉనికే ప్ర‌మాదంలో ప‌డిపోతుంద‌ని హైరానా ప‌డ్డాయి.

“మ‌రేం చేయాలి?”
టీం లీడ‌ర్ ఎలుక అడిగింది.

“దాన్నుంచి కాపాడుకోవాలంటే అదెప్పుడు వ‌స్తుందో మ‌న‌కు తెలియాలి. అలా తెలిస్తే మ‌నం దానికి దొర‌కుండా క‌లుగులోకి వెళ్లి దాక్కోవ‌చ్చు.” ఓ ఎలుక సలహా ఇచ్చింది.
“అవును.. అవును” అన్నాయి అన్ని ఎలుక‌లు. “మ‌రేం చేద్దాం? అది వ‌చ్చేట‌ప్పుడు తెలియాలంటే ఏం చేయాలి?” మ‌ళ్లీ అడిగింది టీం లీడ‌ర్‌.

“దాని మెడ‌లో గంట క‌ట్టాలి. అలా క‌డితే అది న‌డుచుకుంటూ వ‌స్తున్న‌ప్పుడు మ‌న‌కు చ‌ప్పుడు వినిపిస్తుంది. మ‌నం వెంట‌నే అల‌ర్ట్ కావొచ్చు.” ఓ సీనియ‌ర్ ఎలుక చెప్పింది.
“అవును.. అవును క‌రెక్టు.. ఇది బాగుంది ఆలోచ‌న‌.. దీన్ని అమ‌లు చేయండి..” ఎలుక‌ల‌న్నీ ముక్త‌కంఠంతో అన్నాయి. వాటి మోముల్లో ఆనందం క‌నిపిస్తుంది అప్పుడే. అబ్బా ఇక పిల్లి పీడ విర‌గడ‌కాబోతుంద‌ని.

“అవును దాని మెడ‌లో బంగారు గంట క‌ట్టాలి” అన్న‌ది అప్ప‌టి దాక వెనుక వ‌రుస‌లో దాక్కుని ఉన్న ఓ ఎలుక ముందుకు వ‌చ్చి.

“కాదు.. వెండి గంట క‌ట్టాలి.” అన్న‌ది మ‌రొక‌టి. “వ‌జ్రాల‌తో తాప‌డం పెట్టించిన గంట క‌ట్టాలి” అన్న‌ది ఓ ముస‌లి ఎలుక‌.

“కాదు.. కాదు.. ఈ గంట క‌ట్టాలి. ఆ గంట క‌ట్టాలి.” ఎలుక‌లు గోల గోల చేస్తున్నాయి. టీం లీడ‌ర్ ఎలుక‌కు చిర్రెత్తుకొచ్చింది. “ఎహె ఆగండే… గంట ఏదో ఒక‌టి క‌డుదాము కానీ, అస‌లు పిల్లి మెడ‌లో గంట క‌ట్టేదెవ‌రు? ఎవ‌రెళ్లి క‌డ‌తారు?” అని అంద‌రి ముఖాలు చూసింది. అప్ప‌టి వ‌ర‌కు ఉత్సాహంతో ఉన్న ఆ ఎలుక‌లు.. మెల్ల‌గా వెన‌క‌డుగులు వేస్తూ ఓ మూల‌కు చేరుకున్నాయి. “చెప్పండి ఎవ‌రు వెళ్లి పిల్లి మెడ‌లో గంట క‌డ‌తారు?” అవి అన్నీ ఒక‌రిముఖం ఒక‌రు చూసుకుంటున్నాయి. త‌ల‌లు వేలాడేశాయి.

“పిల్లి మెడ‌లో గంట క‌ట్టేదెవ‌రు?” ఆ ఎలుక‌ల ముఖాల‌న్నింటిపై ప్ర‌శ్నార్థ‌కాలు క‌నిపిస్తున్నాయి.

అది అధికార పార్టీ ప‌త్రిక‌. న‌మ‌స్తే తెలంగాణ‌. దీనికి ఎడిట‌ర్ తీగుళ్ల కృష్ణ‌మూర్తి. అధికార‌మే నా చేతిలో ఉంది అని పేప‌ర్‌ను అడ్డం పెట్టుకుని చేసిన దాష్టీకాలు అన్నీ ఇన్నీ కావు. ఏ రోజైతే న‌మ‌స్తేలోకి ఎడిట‌ర్‌గా అడుగుపెట్టిండో .. ఆరోజు నుంచి దాని ప‌త‌నం స్టార్ట్ అయ్యింది. ఉద్యోగుల బ‌తుకులూ ఆగ‌మ‌య్యాయి. బ‌దిలీల పేరుతో కుట్ర‌కు తెర‌తీశాడు. నిర్ధాక్షిణ్యంగా పాత‌వాళ్లంద‌రినీ రోడ్డున ప‌డేశాడు. త‌న వాళ్ల‌ను, కోస్తా బ్రాహ్మ‌ణ‌ల‌ను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆంధ్ర‌జ్యోతి, ఏబీఎన్ నుంచి తెచ్చుకుని ..క‌ళ్ల‌క‌ద్దుకున్నాడు. పేప‌ర్‌ను ఉద్దేరించే పేరుతో పాతాళానికి తొక్కేశాడు. ఆయ‌న ఎడిట‌ర్ కావ‌డ‌మే పిచ్చోడి చేతిలా రాయిలా మారింది. ఏం చేస్తున్నాడో తెలియ‌దు. త‌న మీద త‌న‌కు న‌మ్మ‌కం లేదు. త‌న నీడ‌ను చూసి త‌నే అనుమాన ప‌డే మ‌న‌స్త‌త్వం. అంతా క‌లిసి త‌న వెనుక గోతులు తీస్తున్నార‌ని అనుకునే ఇన్ఫిరియారిటీ. త‌న మెంటాలిటీతో అంద‌రినీ వేధింపులు త‌ప్ప‌డం లేదు. చాలా మందికి జీతాలే లేకుండా చేసి రోడ్డున ప‌డేశాడు. ఉన్నోళ్ల‌కు జీతాలు త‌గ్గించేసి ‘చేస్తే చెయ్ లేక‌పోతే వెళ్లు..’ అనే అవ‌మాన‌క‌ర రీతిలో ప‌నిచేయించుకుంటున్నాడు. జ‌నాల గురించి, స‌మాజం క్షేమం గురించి వార్త‌లు రాసే వీరే అన్యాయానికి గురైతే ప‌ట్టించుకునేవారెవ‌రు? అదీ అధికార పార్టీ ప‌త్రిక‌లో. ఎవ‌రూ నోరెత్త‌లేదు. ఏదో చేద్దామ‌నుకున్నారు. ఏదో రాద్దామ‌నుకున్నారు. ఈ అన్యాయాన్ని వెలిగెత్తి చాటి ప్ర‌పంచానికి తెలియ‌జేద్దామ‌నుకున్నారు. కానీ చేయ‌లేక‌పోయారు. ‘పాపం త‌గిలిపోతాడు’ అని శాప‌నార్ధాల‌కే ప‌రిమిత‌మ‌య్యారు.
కానీ,
‘వాస్త‌వం’ వెబ్ సైట్ కృ.తి ఆగ‌డాల‌ను వెలుగులోకి తెచ్చింది. ప్ర‌భుత్వం నోటిసుకూ ఇది వెళ్లింది. ఎవ‌రి అవ‌స‌రాలు వారివి. ఇంకా కృ.తితో ప్రభుత్వ పెద్దలకు ఎన్ని రోజులు అవ‌స‌రం ఉందో తెలియ‌దు. న‌మ‌స్తే నుంచి గెంటివేయ‌బ‌డ్డ‌వాళ్లు, ప‌నిచేస్తూ నిత్యం న‌ర‌కం చూస్తున్న‌వాళ్లు త‌మ ఆవేద‌న‌ను, అభిప్రాయాల‌ను పంచుకునేందుకు ‘వాస్త‌వం’ వేద‌కిగా నిలుస్తుంది. మీ అభిప్రాయ‌ల‌ను నిర‌భ్యంత‌రంగా చెప్పుకోవ‌చ్చు. 9398999156 నెంబ‌ర్ వాట్సాప్‌కు మీరు చెప్పాల‌నుకున్న‌ది పంపండి. ప్ర‌చురిస్తాం. మీ పేరు ఉంచాలా. వ‌ద్దా మీరే తేల్చుకుండి. ఫోన్లు వ‌ద్దు, అభిప్రాయాలు చెప్పండి.
…………………………………………………………………………
పైన చెప్పిన‌ది పాత వార్తే. కానీ సంద‌ర్బోచితం….
జీతాల నుంచి తీసేసి త‌మ జీవితాల‌ను ఛిన్నాబిన్నం చేసిన కృ.తి ఆగ‌డాల‌ను అడ్డుకునేందుకు, ఆందోళ‌న చేసేందుకు అప్పుడే టీం త‌యార‌య్యింది. న‌మ‌స్తే తెలంగాణ ప్ర‌ధాన కార్యాల‌యం ముందు ధ‌ర్నా చేద్దామ‌నుకుని అంతా రెడీ అయ్యారు. కానీ ఈ విష‌యాన్ని కొంద‌రు లీక్ చేశారు. ఇదే జ‌రిగితే ప్ర‌భుత్వం ఇజ్జ‌త్ పోత‌ద‌ని వెంట‌నే వారికి రెండు నెల‌ల జీతాలిచ్చి నోర్లు మూపించారు. ఆందోళ‌న జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇదిగో ఇన్ని ఏండ్ల త‌ర్వాత మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి ఆ ఆగ్ర‌హం పెల్లుబుకింది. ఆ పిల్లి మెడ‌లో గంట ఎవ‌రు క‌ట్టాలో తెలియ‌క బ‌తుకు భ‌యంతో, జీతం భ‌యంతో, ఉద్యోగ భ‌యంతో బానిస‌ల్లా బ‌తుకుతున్న ఉద్యోగుల్లా మొన్న‌టి వ‌ర‌కు వాళ్లూఉన్నారు. కానీ ఈ రోజు తెగించారు. ప్ర‌ధాన కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న వారికి వీరి ఉద్య‌మ అడుగులే స్పూర్తి కానున్నాయి. ఆ ‘పిల్లి’ మెడ‌లో ఎట్ట‌కేల‌కు ‘తిరుగుబాటు’ గంట క‌ట్టిన ‘నమస్తే’ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎడిష‌న్ టీం కు….. vastavam.in అభినంద‌న‌లు…

You missed