అరవింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం..
దేశ చరిత్రలోనే రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లు వేయించుకున్న ఏకైక వ్యక్తి అరవింద్..
ఇప్పుడు అరవింద్ ను పసుపు రైతులు ఏ ఊరికి పోయిన తరిమికొడుతున్నరు
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్:
దేశ చరిత్రలోనే రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఓట్లు వేయించుకున్న ఏకైక వ్యక్తి అరవింద్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అరవింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను ఓడగొట్టుకున్నమన్నారు. ఇచ్చిన మాట తప్పినందుకు ఇప్పుడు అరవింద్ ను పసుపు రైతులు ఏ ఊరికి పోయిన తరిమికొడుతున్నరన్నరు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్,బాల్కొండ,మోర్తాడ్ మండలాల నుంచి బీజేపీ,కాంగ్రెస్,బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తలు,యువకులు ఆదివారం హైదాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసిఆర్,మంత్రి కెటిఆర్,కవితమ్మ సహకారంతో బాల్కొండ నియోజకవర్గానికి వేల కోట్ల రూపాయల నిధులు తెచ్చి అభివృద్ది చేశాను అన్నారు. ఇటీవల బీజేపీ నడ్డా…కాంగ్రెస్ రాహుల్ గాంధీ మిడతల దండులా తెలంగాణ మీద పడ్డరని విమర్శించారు. పచ్చబడుతున్న తెలంగాణ ను ఆగం చేయాలనుకుంటున్నారా..?బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడి సంక్షేమ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు.తెలంగాణలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని అన్నారు.కరెంట్ ఇస్తలేరని బీహార్ లో రైతులు ట్రాన్స్ఫార్మర్ తగులబెట్టారన్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వి అన్ని బుడ్డర్ ఖాన్ మాటలు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు అన్నారు.బండి సంజయ్ అభివృద్ది తప్పా అన్ని మాట్లాడుతడు అని విమర్శించారు.ఏ రోజు కూడా పాదయాత్రలో పలానా అభివృద్ధి మా రాష్ట్రాల్లో ఉన్నది తెలంగాణ లో చేయండి అని అనలేదు.చెప్పుకోవడానికి వారికి ఏమీ లేవు.విష ప్రచారం చేస్తున్న బీజేపీ,కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ గ్రామాల్లో ప్రజలే నిలదీయాలన్నారు. మీ పాలితరాష్ట్రాల్లో ఇక్కడి సంక్షేమ కార్యక్రమాలు చూపించండి అని అడగాలన్నారు.కేసిఆర్ ఒక్కడే తెలంగాణ ను కంటికి రెప్పలా కపాడుకుంటాడని,కేసిఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.