రాహుల్ గాంధీకి స్వాగతం…
తెలంగాణ ఇచ్చుడు ఆల్చమైన మాట నిజమే. అందుకు అమరులైందీ నిజమే. శ్రీ కృష్ణ కమిటీ నుంచి ఢిల్లీ వార్ రూం దాకా ఎన్నో చర్చలు. పార్లమెంట్ లో బిల్లు పెట్టిన్నాడు సీమాంధ్ర ఎంపీల పెప్పర్ స్ప్రే దాడులు, కత్తుల వీరంగాల నడుమ బీజేపీ మద్దతుతో బిల్లు పాసైతే…60 ఏండ్ల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాయల తెలంగాణ, హైదరాబాద్ లేని తెలంగాణ, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం లాంటి డిమాండ్లు సరైనవి కావని… మనం కోరుకున్న హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణే ఇచ్చింది. ఇచ్చింది అంటే నచ్చకుంటే వచ్చింది. ఇచ్చిన తెలంగాణలో, ఇష్టం లేని ఆంధ్రాలో చిత్తుచిత్తుగా ఓడించినం. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కట్టబెడితే అది కూడా ఖతం చేసింది తెలంగాణ ప్రభుత్వం. బిల్లు పాస్ కావడంలో కీలక పాత్ర పోషించిన మీరా కుమార్ రాష్ట్రపతిగా పోటీ చేస్తే..మన ప్రభుత్వం బీజేపీ అభ్యర్థిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించి రుణం తీర్చుకుంది.
ఏ భావప్రకటన స్వేచ్ఛ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడినమో.. అదే ఉస్మానియా విద్యార్థులతో రాహుల్ ఇంటరాక్షన్ కు పర్మిషన్ ఇవ్వలే. వరంగల్ లో సభ పెట్టినా, ఓయూలో విద్యార్థులతో మాట్లాడినా ఇక్కడి ప్రభుత్వమేం పడిపోదు. తెలంగాణలో కాంగ్రెసును సంపేశి…బుసలు కొట్టే బీజేపీకి పాలు పోశినం. ఇప్పుడు కాకున్నా ఎప్పుడో ఒకసారి కాటేయడం ఖాయం. పీసీసీ అధ్యక్షుడు నచ్చనందుకే కాంగ్రెస్ ను విమర్శించడం కరెక్ట్ కాదేమో. నిజమేటంటే తెలంగాణ యూత్ బీజేపీ వైపు మల్లుతోంది. జై శ్రీరాం నినాదాలు, హన్మాన్ ర్యాలీలు మంచిగ అక్కెరొస్తున్నయి. తెలంగాణలో కాంగ్రెస్ ను గెలవనియ్యకున్నా…ప్రధాన ప్రతిపక్షంగా ఉండనివ్వాలి. అది తెలంగాణ మత సామరస్యానికి అవసరం.
జై తెలంగాణ..✊
Raghu Bhuvanagiri