ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌లో పెట్టిన ప్రెస్‌మీటింగ్‌లో బీజేపీ హామీల మీద చాలా హుందాగా మాట్లాడారు. ఒక పద్దతిలో పార్లమెంటు లాంగ్వేజ్‌లో విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలు మూడేండ్లు గడిచినా ఎందుకు నెరవేర్చలేదు? అని అడిగారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కవిత ప్రెస్ మీటింగ్ మీద స్పందించారు. కానీ వాడిన భాష సరిగా లేదు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు , పసుపుకు మద్దతు ధర కవిత ప్రెస్‌మీట్‌లోని ప్రధాన అంశాలు. వాటి మీద అర్వింద్ మాట్లాడకుండా ఏవేవో మాట్లాడుతూ నీ అయ్యా అని పలుమార్లు సంభోదించడం సరిగా లేదు. ఒక మహిళా ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ అసహనం ఎందుకు..?
మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా..?
ఇలాగే మాట్లాడమని బీజేపీ అధిష్టానం చెప్పిందా..?
Ramana Rao Nellutla
