ఎన్నడూ లేదు. కేసీఆర్ బర్త్ డే వేడుకలు మూడు రోజుల పాటు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చాడు. మొన్నటి నుంచి కేసీఆర్ మంచి దూకుడు మీదున్నాడు. మోడీని, కేంద్రాన్ని, బీజేపీని ఒక ఆట ఆడుకుంటున్నాడు. బీజేపీని ఏకిపారేస్తున్నాడు. ఇక్కడి నేతలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఏ మాత్రం అవకాశం వచ్చినా వదలడం లేదు. ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ బీజేపీ. చచ్చిన పార్టీని లేపిందీ కేసీఆరే. లేచి బుసలు కొడుతున్న బీజేపీని పే…ద్ద కర్రతో కొట్టి చంపేందుకు సిద్దపడుతున్నదీ కేసీఆరే. మధ్యలో కాంగ్రెస్ ది ప్రేక్షకపాత్రన్నమాట. రాహుల్‌ను అస్సాం ముఖ్యమంత్రి తిట్టినా పాపం ఏమీ చేయలేని, అనలేని నిస్సహాయ స్థితి దానిది. ఈ రోజు మేల్కొని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తారట. ఈ అస్త్రాన్ని వాడుకుని బీజేపీపై ఎప్పుడో సంధించి వదిలేశాడు కేసీఆర్. రాహుల్ కన్నా, కాంగ్రెస్ కన్నా… కేసీఆర్ సకాలంలో స్పందించిన తీరు టీఆరెస్‌కే మైలేజీని తెచ్చిపెట్టాయి.
మూడు రోజుల పాటు బర్త్ డే వేడుకలు చేయించుకోవడం వాస్తవానికి కేసీఆర్ మనస్తత్వానికి సూట్ కాని అంశమే. కానీ ఎలా ఒప్పుకున్నాడు. కేటీఆర్ ఒప్పించాడా..? మధ్యలో పీకే సలహా మేరకు తప్పడం లేదా..? కానీ మరీ మూడు రోజులా..? చూసే జనానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది మరి. తప్పదు. అసలే చాలా మంది మాకు పదవులు లేవు, ప్రభుత్వంలో మాకు గుర్తింపు లేదని, ఎమ్మెల్యేలపై గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ ఇలాంటి పిలుపునిస్తే ఏం చేస్తారో… ? చేయక ఏం చేస్తారంటారా..? చెయ్యాల్సిందే. అంతే. తగ్గేదే లే.