#తీన్మార్ మ‌ల్ల‌న్న fact_finding

బిజెపికి అంత‌ర్గ‌తంగా భావ‌జాల పునాది వున్న‌ది.
నారాయ‌ణ గురు, ఫులె, పెరియార్‌, అంబేడ్క‌ర్‌, కాన్షీరాం సిద్ధాంతాలు వాటిని వొప్పుకోవు.
మొన్న‌టి దాకా యివే పేర్లు వాడుకున్న‌వ్ సిద్ధాంత, ఫీల్డ్ వ‌ర్క్ ప‌రంగా. అన్నిటినీ వార‌ణాసిలో క‌లిపి
జాతీయ పార్టీలో చేరిన‌వ్ మంచిదే.
త‌మ‌రికి వొక వేగ్ ఐడియా, షార్ట్‌క‌ట్‌లో అసెంబ్లీలో వుండాల‌ని కోరిక వున్న‌ట్టుంది. అది సాధ్యం కాదు.
గ‌తంలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య (మున్నూరు కాపు) ద్వారా ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్న‌వ్‌.
త‌ర్వాత కోదండరాం రెడ్డితో ములాఖ‌త్ అయిన‌వ్‌, ఆడ నీ అంగిలాగు సిద్ధాంతం న‌డ‌వ‌క బ‌య‌ట‌ప‌డిన‌వ్‌.
యిండిపెండెంట్‌గా హుజూర్‌న‌గ‌ర్ ఎన్నిక‌ల్లో ద‌ళిత‌, బ‌హుజ‌న యూత్‌ను వాడుకొని వ‌దిలేసిన‌వ్‌.
చీక‌టి వొప్పందంతో ఎమ్మెల్సీకి పోటీ చేసి రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌కు ధ‌మ్కీ యిచ్చిన‌వ్‌. వోకే.
త‌ర్వాత ఎస్‌సి, బిసి సోద‌రులు నీకు పూర్తిగా దూర‌మైన‌రు. న‌మ్మ‌కం పోయి కోపంలో వున్న‌రు యూత్ అంతా.
బిజెపి జాతీయ పార్టీ …ఓబిసి జాతీయ అద్య‌క్షుడు ల‌క్ష్మ‌న్‌, ధ‌ర్మ‌పురి అర‌వింద్‌, బండి సంజ‌య్ వంటి నాయ‌కులు మున్నూరు కాపు కుల‌స్తులే, కానీ, వారు ఖ‌చ్ఛితంగా
పార్టీ ఆలోచ‌న‌ల‌కే క‌ట్టుబ‌డుత‌రు. నీ కోసం వాల్ల కెరీర్‌, క్రెడిబిలిటీ త్యాగం చేయరు, స‌త్యం. all the best.

(యీ అభిప్రాయాల‌న్నీ ఫేస్‌బుక్‌, ప్రెస్‌క్ల‌బ్‌లో చ‌క్క‌ర్ కొడుతున్న‌య్‌)

కొంపెల్లి వెంకట్ గౌడ్

You missed