సాహిల్ ఠాకూర్ , ఢిల్లీ కి చెందిన వ్యాపారవేత్త , వయసు 27 ఏళ్ళు ; వాక్సిన్ రెండు డోసులు తీసుకొన్నాడు . నవంబర్ 20 న దుబాయ్ కి వెళ్ళాడు . తిరుగు ప్రయాణం లో{ డిసెంబర్ 4 } దుబాయ్ ఎయిర్పోర్ట్ లో టెస్ట్ జరిపారు . నెగటివ్ వచ్చింది . ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో తిరిగి టెస్ట్ జరిపారు . ఇక్కడ పాజిటివ్ వచ్చింది .

” మీ శాంపిల్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాము . ఇంట్లోనే ఉండాలి” అన్నారు . సరే అన్నాడు . ఇంటి ముందు నలుగురు
పోలీస్ లు వున్నారు . షాక్ తిన్నాడు . డిసెంబర్ 6 న అతని జెనెటిక్ సీక్వెన్సింగ్ ఫలితం వచ్చింది .” నీకు సోకింది ఓమిక్రాన్” అన్నారు . ఆయనమరో సారి షాక్ తిన్నాడు . ” ఇంకో సారి చెక్ చెయ్యండి . నాకు కనీసం ఒక్క లక్షణం లేదు ” అని అన్నాడు . అధికారులు పట్టించుకోలేదు . అంబులెన్సు లో ఢిల్లీ లోని లోక్ నాయక్ జయ ప్రకాష్ ఆసుపత్రికి తరలించారు .

అక్కడ డాక్టర్ లు ఆయనకు మందులు ఇవ్వబోయారు . నాకు కనీసం ఒక్క రోజు జ్వరం లేదు . దగ్గు లేదు . నా నుంచి మా ఇంట్లో ఒక్కరికి కూడా సోకలేదు . నాకెందుకు మందులు ? ఈ మందుల వల్ల నాకేమైనా జరిగితే ?” అని ఎదురు తిరిగాడు . మందులు తీసుకోవడానికి నిరాకరించాడు .

అటు పైన ఆయన జాతీయ మీడియా తో మాట్లాడుతూ ” నా లాగే ఆసుపత్రిలో నలభై మంది వున్నారు . వారిలో 35 మంది దాకా ఎలాంటి లక్షణాలు లేవు . ఎందుకు ఆసుపత్రిలో పెట్టారో అర్థం కాదు . డెల్టా డేంజరస్ . నేను ఒప్పుకొంటాను . ఓమిక్రాన్ అందులో కనీసం పదోవంతు కూడా లేదు . ” అని అన్నాడు .

నా మాట :

మీకు గుర్తుండే ఉంటుంది . గత సంవత్సరం కరోనా తోలి రోజుల్లో ఇలాంటి ఓవర్ యాక్షన్స్ చాలా చూసి వుంటారు . అంబులెన్సు రావడాలు . కొందరు దాన్ని వీడియో తీసి టెర్రరిస్ట్ లు దొరికినట్టు సోషల్ మీడియా లో పోస్ట్ చెయ్యడం . వారి కాలనీ ముందు గేట్లు పెట్టి ఎర్ర రిబ్బన్ కట్టడం మొదలైనవి . ఇక రెండవ వేవ్ కు వచ్చేటప్పటికి ..” దేవుడా నాకు ఊపిరి ఆడడం లేదు . ఆసుపత్రిలో బెడ్ లేకపోతె సరి కనీసం ఒక మందు ఇప్పించండి ” అంటే పట్టించేకొనే దిక్కు లేక పోయింది . ఎవరి చావు వారు చచ్చారు .

ప్రభుత్వం అనగానే మీకు ప్రధాని , ముఖ్య మంత్రులే కనిపిస్తారు . ఇలాంటి విషయాల్లో వారిని కూడా తికమకకు గురిచేసి మాఫియా కింది స్థాయిలో మేనేజ్ చేస్తుంది . ఓమిక్రాన్ మహా డేంజరస్ అని నిరూపించే పనిలో ఇప్పుడు మాఫియా ఉంది. వారి కర్మ కాలి ఏదీ సహకరించడం లేదు . సాహిల్ కుటుంబ సభ్యులకు సోకి ఉంటే వామ్మో చూసారా ఇది చాల ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అని ఇప్పటికే ఢిల్లీ లో లాక్ డౌన్ పెట్టేసి ఉండేవారు . వారు పట్టు విడువరు. ఏదో ఒకటి చేస్తారు . జనాల్లో భయం రావాలి. చిన్న అనుమానం వచ్చినా ఆసుపత్రులకు పరుగెత్తాలి . బెడ్ లు బుక్ చేసుకోవాలి . తిరిగి డెల్టా నాటి సీన్ రిపీట్ కావాలి . లాక్ డౌన్ పెట్టాలి . అదే వారి ఎజెండా .

Amarnath Vasireddy

You missed