టీఆరెస్ సోషల్ మీడియా ఓవైపు.. కార్యకర్తలో వైపు… కేసీఆర్‌పై, ఆ పార్టీ నేతల వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఔను.. ఇది కొంత కాలంగా జరుగుతూనే ఉన్నది. కానీ, ఇది మరింతగా పెరిగిందిప్పుడు. ఇక తట్టుకోలేకపోతున్నారు. ఓపిక నశించింది. మీ ఖర్మరా చావండి..మిమ్మల్ని బాగు చేయడం ఎవరి తరం కాదు.. మీరింతే.. అని శాపనార్థాలకు దిగారు. ఫ్రస్టేషన్ అంతా చూపిస్తున్నారు.
ఎప్పటిప్పుడు పార్టీని కాపాడుకునేందుకు స్వచ్చంధంగా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో బట్టలు చింపుకున్న ఈ టీఆరెస్ సోషల్ మీడియా వారియర్లు.. ఇక చాలనుకున్నారు. మనది మనమే బట్టలు చింపుకుని ఇలా బరిబాతల నిలబడ్డాం.. అయినా పట్టించుకున్న దిక్కు లేదు. ఇక దిగంబర వేశాలు.. చాలుగానీ, చాలించుకుని మన పనులు మనం చేసుకుందాం అని డిసైడ్ అయినట్టున్నారు.
నేతలు ఎవరికి వారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు. ఎవరి సంపాదనలో వారున్నారు. మీ గురించి ఎవడు పట్టించుకుంటడు బై… ఇప్పటి దాక పెండ్లాం పిల్లల్ని కాదని వారి బాగోగులు మరిచి బాగానే సేవ చేశారు. భజన చేశారు. ఇక చాలించండి. బతుకుదెరువు చూసుకోండి……