తీన్మార్ మ‌ల్ల‌న్న నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఓ జ‌ర్న‌లిస్టు. ప్ర‌శ్నించే గొంతుక అని ముందుకు వ‌చ్చాడు. చాలా మంది మ‌ద్ద‌తు కూడా కూడ‌గ‌ట్టుకున్నాడు. జైలుకు వెళ్లిన త‌ర్వాత త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుంది. ఇక బీజేపీలో చేరితే త‌ప్ప .. బ‌తుకు లేద‌నుకున్నాడో. బ‌త‌క‌నివ్వ‌ర‌నుకున్నాడో. అర్వింద్ కుల రాజ‌కీయం ప‌నిచేసిందో తెలియ‌దు కానీ బీజేపీలో చేరాడు. ఇక జ‌ర్న‌లిస్టు అని చెప్పుకోవ‌డానికి అర్హ‌త లేకుండా చేసుకున్నాడు. కానీ మ‌ల్ల‌న్న‌మాత్రం ఇంకా జ‌ర్న‌లిస్టు ముసుగులోనే ఉన్నాడు. మొన్న‌టి వ‌ర‌కు జ‌ర్న‌లిస్టు గా చూసిన వారంతా ఇప్పుడు ఈస‌డించుకుంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా మాయ‌మాట‌లు చెప్తావురా బాబు.. అని బీజేపీపై గ‌తంలో తాను చేసిన కామెంట్లు.. ఏ పార్టీలో చేర‌న‌ని జ‌ర్న‌లిస్టుగానే ఉంటాన‌ని చెప్పుకొచ్చిన ముచ్చ‌ట్ల‌న్నీ బ‌య‌ట పెడుతున్నారు. మాయ‌లోడు మ‌ల్ల‌న్న అని నామ‌క‌ర‌ణం చేసి ఇలా ప్ర‌చారం చేస్తున్నారు.