పెద్దసారు కేసీఆర్ ఎలాగూ ఎవరికీ టైమ్ ఇవ్వడు. కలవడు. మంత్రులకే అక్కడ మాట్లాడేందుకు వాయిస్ లేదు. ఇక మిగిలిన వారి గురించి చెప్పనవసరం లేదు. ఏమైనా చెప్పుకోవాలంటే యువనేతే. కానీ కేటీఆర్ కూడా నెలల తరబడి ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదట. ఆఖరికి ఎమ్మెల్యేలకు కూడా కేటీఆర్ టైమ్ ఇవ్వడం లేదట. ఏదో ఒక ప్రోగ్రామ్‌లో కేటీఆర్‌ను ఎలాగైనా కలుసుకుని ఆ దొరికిన కొద్ది సమయంలోనే తమ గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేస్తున్నారట. దానికీ ఆయన పొడిపొడిగానే, చిరునవ్వుతో ఓ సమాధానమిచ్చి దాటవేయడమే గానీ, సమస్యలు పరిష్కారం కూడా కావడం లేదట.
ఎందుకు…? యువనేత ఆంతర్యమేమిటీ..? ఎందుకు ఆయనలో ఇంత వైరాగ్యం..? విషయమేమిటంటే… ఆయన చెప్పినా పనులు కావడం లేడట. సాక్షాత్తూ సీఎస్ సోమేష్ కుమార్ కూడా తన మాట వినడం లేదనేది టాక్. ఎవరైనా తన వద్దకు వచ్చి సమస్యచెబితే దాన్ని వెంటనే సీఎస్‌కు ఫార్వార్డ్ చేసి అది పరిష్కరించండని కేటీఆర్ చెబుతాడు. కానీ ఆ ఫైల్ అక్కడే ఉంటుంది. సీఎం దాకా వెళ్లదు. ఎందుకంటే, సీఎం చెబితేనే గానీ ఏ అడుగూ అక్కడ ముందుకు పడదు. ఆఖరికి సీఎస్ దగ్గర కూడా. ఇలా చెప్పి.. చెప్పీ.. విసిగి వేసారి పోయిన కేటీఆర్. ఇక చెప్పడం మానేశాడు. తనకు వద్దకు వచ్చే వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వడమూ ఆపేశాడు. తమ గోడు ఎక్కడ వెళ్లబోసుకోవాలో తెలియక, ఉద్యోగులు, లీడర్లు, ఎమ్మెల్యేలు… అంతా ఒకరికొకరు చెప్పుకుని బాధపడుతున్నారే తప్ప.. దీనికి పరిష్కారం మాత్రం కనుక్కోలేకపోతున్నారు.