(ఇది పూర్తిగా నా సొంత అభిప్రాయం 😊 నా అభిప్రాయం మీ అభిప్రాయం ఓకేలాగా ఉండాలి అని లేదు ☺️ కాబట్టి ఆవేశం వద్దు)

ఒక వేల BJP గెలిస్తే KCR తన సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేసినా KCR చెప్పినట్టు ఒక చిన్నోడి ముందు ఓడినట్టు అవుద్ది. TRS లో ఉన్న అసంతృప్తులకు ఈటెల గెలుపు కారు చీకటిలో ఒక ఆశ జ్యోతి లాగా కనపడుతుంది. గెలవడానికి ఎప్పుడు లేని విదంగా మంత్రులు, MLA ల మోహరింపు, వారి తో ప్రచారం పనికి రాకుండా పోతాయి. హరీష్ రావు ని ప్రజలు నమ్మడం లేదు అని రుజువు అవుద్ది. ఓటుకి 6 వేలు ఇచ్చిన గెలువకపోవడం తో డబ్బు తో ఓట్లను కొనలేము అని అర్ధం అవుద్ది, సాధారణ ఎన్నికల కి దళితబంధు అనేది మెడకు చుట్టునున్న పాము లాగా, రాష్ట్ర ఖజానా కి మోయలేని భారంగా మారుద్ది.

వరుస విజయాలతో ఉన్న KCR ఇప్పటి నుండి అపజయాలు కూడా అలవాటు చేసుకోవలేమో, తాను తీసుకునే నిర్ణయాలు ఇక ముందు ఆచితూచి తీసుకోవాలిసి వస్తుంది.ఈటెల తన విజయాన్ని ఎప్పటికి చెప్పుకునే లాగా ఉంటది.

మొత్తంగా ఈటెల ఘట్టం ఒక విఫల ప్రయోగం లా మిగిలిపోద్ధి TRS చరిత్ర లో 😢 .

ఒక వేళ TRS గెలిస్తే అన్ని ఉప ఎన్నికల్లో లాగా ఇది కూడా ఒక విజయం KCR ఖాతాలో పడుతుంది. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమం లో జరిగిన ఉప ఎన్నిక లాగా కాకుండా, అధికారం, డబ్బు, పథకాల లబ్దిదారులు ఇలా అన్ని సౌకర్యాలు ఇప్పుడు KCR చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈటెల గెలిస్తే చెప్పుకునే అంత గొప్పగా KCR కి ఉండకపోవచ్చు.

కానీ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో KCR పోల్ మేనేజిమెంట్ కి తిరుగులేదు, ప్రజలనాడి ని KCR గుర్తించినంత ఇంకే నాయకుడు గుర్తించలేడు అని ఇంకో సారి రుజువు అవుద్ది. అసంతృప్తులు కూడా వారి ఆలోచన ని వెనిక్కి తీసుకొని ఎప్పటిలాగే KCR అడుగుజాడల్లో నడువవలిసి వస్తుంది 😊.

ఈటెల విషయానికి వస్తే BJP ఎంచుకోవడం పైన, బావిషత్తు రాజకీయాల్లో ఏ పార్టీలో చేరడం ఆలోచన చెయ్యాలి

– ఎర్ర మల్లి ని