కొడుకును సీఎం చేద్దామ‌ని అంతా చ‌క్క‌దిద్దుకొని, ముహూర్తం కోసం చూస్తుంటే.. ఈ రెడ్ల పంచాదేందిరా బై అని కేసీఆర్ త‌ల‌ప‌ట్టుకుంటున్నాడ‌ట‌. యువ‌రాజుకు ఎలాంటి చిక్కుల్లేకుండా చేసి పీఠం మీద కూసోబెట్టి ఇక హాయిగా ఉందామ‌నుకుంటున్న స‌మ‌యంలో.. జ‌మ్మికుంట రెడ్ల ఆత్మీయ స‌భ పేరుతో పెంట పెంట చేస్తిరి క‌ద‌రా అని తిట్టిన తిట్టు తిడ‌త‌లేడంట పెద్ద‌సారు. అవును ఇదీ మ‌రీ టూ మ‌చ్ హ‌రీశ‌న్న‌. నీకు ఈ ఎన్నిక‌లో గెలిచి రావాల‌ని బాధ్య‌త అప్ప‌గించిర్రు స‌రే.. ఇలాంటి స‌భ పెట్టేముందు ఎవ‌రెవ‌రు ఏమేమీ మాట్లాడాలో ముందే ఇసారించుకోవ‌ద్దా? క‌ల్లుతాగిన కోతిలెక్క ఎవ‌రిది వాళ్లు ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడిపోయిర్రు. ఇప్పుడు ఈ కొత్త పంచాయ‌తీ మామ నెత్తికి చుట్టుకున్న‌ది. నువ్వు హ‌న్మంతుడిని చేయ‌బోతే కోతై కూసున్న‌దే హ‌రీశ‌న్న‌. రెడ్ల‌కు ఇన్ని ప‌దువులిచ్చిండ్ర‌ని, అడ‌క‌ముందే కేసీఆర్ ఇస్తున్న‌డ‌ని, మ‌న‌మే తోప‌ని, ఇలా ఏవోవే మాట్లాడి.. ప‌ద‌వులు రానోళ్లు, అసంతృప్తుల‌ను రెచ్చ‌గొడితిరి. ఇత‌ర కుల‌పోళ్ల క‌డుపు ర‌గిలేట‌ట్టు చేస్తిరి. ఇప్పుడు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ పెడితే .. రెడ్ల సంఖ్య‌ను త‌గ్గించుకోవాల్నా ఏందీ? అట్ల‌నే చేస్తిరిపో. ఉన్నకాడుండ‌ర్రా.. మీరు.. లేని త‌ల‌నొప్పి తెచ్చిపెడ్త‌రు.

You missed