గమనించారా ?
నిన్న మహారాష్ట్ర లో కేసుల సంఖ్య మైనస్ పదివేలు . మైనస్ ఏంటి ? అంటే గత వారం పది రోజులుగా లేని కేసుల్ని పాజిటివ్ కేసులుగా చూపించారన్న మాట . దాని ఇప్పుడు తీసేసారు .
మీడియా దీని గురించి ఎక్కడైనా ప్రస్తావించిందా ? సమస్యే లేదు . అలాటి అసలు ఏమీ పెట్టుకోకండి .
సెప్టెంబర్ నెల చివరికి తీరిగీ లాక్ డౌన్ విధించాలని మహారాష్ట్ర ముఖ్య మంత్రి ఆలోచిస్తున్నట్టు మీడియా లో కథనాలు వచ్చాయి . అది జరిగిన రెండు రోజులకే ముంబై మహిళా మేయర్ ముంబై నగరం లో మూడో వేవ్ వచ్చేసింది అని ప్రకటించేసారు .
కృత్రిమంగానైనా కేసులు పెంచి లాక్ డౌన్ పెట్టాలని తీవ్ర ప్రయత్నం జరిగింది . మరి ఏమైందో తెలియదు . ఇక లాభం లేదు .. పరువు పోతుంది అనుకున్నారేమో .. తూచ్ .. ఇవి కేసులు కావు అని వాటిని లెక్కనుంచి తీసేసారు .
నిన్న మహారాష్ట్ర లో కేసులు మైనస్ పదివేలు కావడం వల్ల ఇండియా లో కేసులు 24 వేలు . ఈ రోజు ఇక మామూలు లెక్కలు . ఇండియా కేసులు 37 వేలు . నిన్న తగ్గిందని రాయలేదు . ఈ రోజు మాత్రం మళ్ళీ పెరిగిన కేసులు అని రాసేస్తారు .. చూడండి .
కరోనా కొంతమంది పాలిట కామధేనువు .. కల్పవృక్షం గా మారిపోయింది . జనాల్ని బకరాలు చెయ్యడం ఎలాగో ఒక ఫైన్ ఆర్ట్ గా మారిపోయింది .
అన్నట్టు మనం సెప్టెంబర్ రెండో వారం లో వున్నాము . మూడో వేవ్ చివరి గడువు సెప్టెంబర్ రెండో వారం.. ఎవరి గడువు అంటారా ? అదేదో దిక్కుమాలిన సర్వే లో .. జూన్ , జులై .. ఆగష్టు అయిపొయింది . ఇక మిగిలింది సెప్టెంబర్ రెండో వారం .
చివరాఖరికి కేరళలో కూడా కేసులు అంతకన్నా ముఖ్యంగా టెస్ట్ పాజిటివిటీ రేట్ తగ్గడం మొదలైపోయింది .
అదిగో మూడూ వేవ్ .. ఇదిగో ముహూర్తం అని వచ్చిన సర్వే న్యూస్ మొత్తం సేవ్ చేసి వుంచాను . త్వరలో ఒక్కక్కటి పోస్ట్ చేస్తాను . ఎంత డబ్బు తీసుకొని ఫేక్ రిపోర్ట్ ఇచ్చాడో ఒక్కోడిని ప్రశ్నించండి .
Amarnath vasireddy