#ఇన్నారుళ్లా
”మిత్రుల నిన్నటి ఆశీర్వాద బలమో,
కరోనా పుణ్యమో,
ఆన్లైన్ గొప్పదనమోగని
మొత్తమ్మీద
ఏజెంట్ ప్రమేయం లేకుండా,
రూపాయి అదనపు ఖర్చు లేకుండా
ఆర్టీఏ ఆఫీసులో పని ముగిసింది.
కావాల్సిన పనులు..
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, అడ్రస్ చేంజ్.
అసల్ది మరిచిపోతున్న,
2000 సంవత్సరంలో లైసెన్స్ తీసుకున్నప్పుడు అంతా మాన్యువల్.
వచ్చిన కార్ డ్రైవింగ్, బైక్ డ్రైవింగ్ కోసమే లైసెన్స్ అయినప్పటికీ అప్పుడు 1500 రూపాయలు ఖర్చు పెట్టాల్సివచ్చింది.
దాన్ని ఆన్లైన్లోకి ఎప్పుడు మార్చిండ్రోగని కార్ డ్రైవింగ్ లైసెన్స్ ను కాస్తా నాకు అవసరం లేని ట్రాక్టర్ డ్రైవింగ్ లైసెన్సుగా మార్చిండ్రు.
ఇప్పుడు తిరిగి మార్చడానికి ఎన్ని కొర్రీలు పెడ్తరోనని భయపడుకుంటూ ఆఫీసుకు పోయిన, కానీ అప్పటి ఒరిజినల్ లైసెన్స్ చూసి పది నిమిషాల్లో మార్చిండ్రు.
బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం కాకపోయినప్పటికీ ఒక్కపూటలోనే పని పూర్తయింది.
థాంక్యూ తెలంగాణ ఆర్టీఏ.
థాంక్యూ కరీంనగర్ ఆర్టీఏ స్టాఫ్..
ఒకప్పుడు కేవలం కరీంనగర్ ఆర్టీఏ ఆఫీస్ పరిసరాలు దాదాపు ఓ యాభై ఏజెంట్ల (బ్రోకర్) ఆఫీసులు, ఓ నూరు నూటయాభై మంది వారి అసిస్టెంట్లతో కళకళలాడేది.
సీనియర్ ఏజెంట్లైతే ట్రాన్సుపోర్టు మినిష్టర్ లెక్కనే కనపడేది.
ఇప్పుడు ముగ్గురో, నలుగురో ఏజెంట్లతో బోసిపోయి కనిపిస్తోంది.
పాపం… వాళ్ళందరు ఇప్పుడెట్ల బతుకుతుండ్రో యేమో?!”
నోట్:
మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం మాత్రం సర్కార్ డాక్టర్ కు రెండు వందల రూపాయల కట్నం సదివిచ్చిన.
ధాము నర్మాల