తీన్మార్ మల్లన్న ఇది నీకే. నీ గురించే. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజాస్వామిక వాదికరుణాకర్ దేశాయి కేతిరెడ్డి తన ఎఫ్‌బీ వాల్‌పై దీన్ని పోస్ట్ చేశాడు. వాడు రాకపాయె… వీడురాకపాయె అని ఎదురు చూడొద్దని కూడా ఆయన హితబోధ చేశాడు. తీన్మార్ మల్లన్న జర్నలిస్టు ముసుగులో ఉన్న ఓ రాజకీయ నాయకుడు. దీన్ని ఎవరూ కానదలేరు. జర్నలిస్టు అనే అస్త్రాన్ని తన అవసరాలకు వాడుకునే ఓ బ్లాక్‌మెయిలర్ అని కూడా అంటే ఎవరూ అభ్యంతరం చెప్పరేమో..! ప్రభుత్వ వ్యతిరేక వార్తలు కావాలి. చెప్పాలి. బోలెడున్నాయి. లోపాలు ఎత్తి చూపాలి. లెక్కలేనన్ని ఉన్నాయి. లీడర్ల అవినీతి, అక్రమాలున్నాయి. అధికార వైఫల్యముంది. అధికార దుర్వినియోగమూ ఉంది. ఎమ్మెల్యేల అరాచకాలున్నాయి. నియంతృత్వముంది. దొరస్వామ్య పాలన ఉంది… ఇలా చాలా ఉన్నాయి. అన్నింటి గురించీ చెప్పొచ్చు. చెప్పే విధానంలో. కానీ .. ఇలా తన లక్ష్యం కోసం, తన ఉనికి కోసం, ఎవరి లాభం కోసమో, మరెవరో మెప్పు కోసమే.. దిగజారిపోయి .. విలువంటూనే మనమే వలువలు దిగజార్చుకుని ప్రవర్తించడం ఎవరూ ఒప్పుకోనిది. దీన్ని కొన్ని సెక్షన్లు ఎంజాయ్ చేస్తుండొచ్చు గాక. కానీ చాలా మందికి రోత పుడుతుంది. అంతెందుకు? ఓ కమ్యూనిస్టు లీడర్. ఈ రోజు తీన్మార్ మల్లన్న అరెస్టును ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఈయనే నాతో గతంలోఓ సారి మాట్లాడుతూ.. మరీ టూమచ్‌గా మల్లన్న మాట్లాడుతున్నాడు. ఇది కరెక్టు కాదు. పద్దతి కాదని ఖండించినవాడే.
ఒక లీడర్‌గా ఎదగాలా? అయితే ఏదైనా పార్టీ ఎంచుకో…?
జర్నలిస్టుగానే ఉండాలా? ఏ పార్టీ కొమ్ము కాయకు.
రెండోది అసంభవమే. ఏ పార్టీ మద్దతు లేకుండా, అండాదండా లేకుండా ప్రభుత్వాన్ని ఢీకొట్టగలడా..? అంత దమ్మున్న జర్నలిజం ఇప్పుడుందా?
ఇది డిబేటబుల్ అంశం. దీనిపై మరోసారి చర్చిద్దాం. మీలో ఎవరైనా ఈ సబ్జెక్టు మీద రాస్తే ప్రచురించడానికి మేం సిద్ధం…