టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌ను ప‌ట్టించుకునేవారు లేరు. ఏదో హుజురాబాద్ అవ‌స‌రాల కోసం మొన్న హ‌రీశ్‌రావు కొంత మందిని పిలిపించి భోజ‌నం పెట్టించి పంపించాడు.దీనికి మ‌మ్మ‌ల్ని పిల‌వ‌లేదంటే, మ‌మ్మ‌ల్ని పిల‌వ‌లేద‌నే అల‌క‌లు. హుజురాబాద్ మ‌రింత లేట‌వుతుంద‌నే సంకేతాల నేప‌థ్యంలో టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌ను ప‌ట్టించుకున్న‌వారు లేరు. దీంతో మొన్న‌టిదాక శోషొచ్చేదాక సోష‌ల్‌మీడియాలో అరిచినా.. వారి వేద‌న అర‌ణ్య రోద‌నే అవుతుంది. గుర్తింపు ఉండ‌టం లేదు. ప‌ట్టించుకునేవారు లేరు. దీంతో లేటుగానైనా త‌త్వం బోధ‌ప‌డుతున్న‌ట్టుంది కొంద‌రికి. సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండ‌ట‌మే బెట‌ర్‌.. దీంతో ఉత్త టైం వేస్ట్ వ్య‌వ‌హారమ‌ని రంజిత్ రెడ్డి క‌ర్ర అనే హార్డ్ కోర్ టీఆరెస్ అభిమాని ఎఫ్‌బీలో త‌న వాల్‌పై పోస్ట్ చేశాడు. దీనికి చాలా మంది సపోర్టుగానే కామెంట్లు పెట్టారు.

మొన్న టీఆరెస్ రాష్ట్ర క‌మిటీ మీటింగులో ద‌ళిత‌బంధుపై ఇక ఇత‌ర‌త్రా కామెంట్ల‌పై ప్ర‌తిప‌క్షాల‌కు ధీటుగా స‌మాధాన‌మివ్వాల‌ని టీఆరెస్ నాయ‌కుల‌కు సీఎం కేసీఆర్‌, కేటీఆర్ పిలుపునిచ్చారు. కానీ వారిక‌న్నా సోష‌ల్ మీడియా వారియ‌ర్సే చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్నారు. కానీ వీరిని ఎవ‌రూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా ఎవ‌రికివారే క్ర‌మంగా పార్టీకి దూర‌మ‌వుతూ వ‌స్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు స్వ‌చ్చంధంగా కేసీఆర్ మీద అభిమాన‌మో, తెలంగాణ మీద ప్రేమో వీరిని న‌డిపించింది. కానీ ప్ర‌స్తుత నేత‌ల వ్య‌వ‌హార శైలి, పార్టీ విధానాల‌కు వారికి కూడా రోత పుట్టేలా చేస్తున్న‌ట్టున్నాయి. అందుకే క్ర‌మంగా త‌ప్పుకుంటున్నారు.

You missed