పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఆ మత్తులో మునిగితేలుతుంటే వచ్చే కిక్ నీకేం తెలుసు రాహుల్?
పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు.. కీర్తి కిరిటాలు ధరించి ఊరేగని ఆ జీవితం జీవితమేనా..?
అయినా అది అనుభవిస్తేనే తెలుస్తుంది?
ప్రజలు పాలాభిషేకాలు ఎందుకు చేస్తారు? మంచి పాలనకు వారిచ్చే కితాబది. వాళ్లకు కావాల్సింది మనమిస్తే.. మనకు ఏం అవసరమో వాళ్లకు తెలుసు కాబట్టి.. అలా పాలాభిషేకాలు చేసి మన మనస్సును రంజింపజేస్తారు. దాని వల్ల ఏమవుతుంది? ప్రజలకు ఇంకా ఏమైనా చేయాలనిపిస్తుంది. పదే పదే వారితో పాలాభిషేకం చేయించుకోవాలనిపిస్తుంది? దీంట్లో తప్పేముంది??
అంతిమంగా ప్రజలకు మేలే జరుగుతున్నది కదా. ఇది గ్రహించరా? మరి దీన్ని కీర్తి ఖండూతి అంటరా?
అనుకోండి మీరేమైనా. మాకు అలా ఎప్పుడూ పొగిడించుకోవాలని, ఎల్లప్పుడూ పాలాభిషేకాలు చేయించుకోవాలని ఉండదు. అది ప్రజల అభిమానం. కాదనడానికి మనమెవరం?
మరి మా పత్రికలో, టీవీల్లో కూడా వీటిని గొప్పగా చూపిస్తున్నారంటారా?
చూపిస్తరు బై. అవి మా కోసమే పెట్టుకున్నాం కదా. మాకు పాలాభిషేకాలు చేస్తే చూపియ్యకపోతే, రాయకపోతే, దిష్టిబొమ్మలు దహనం చేసినవి చూపిస్తారా? రాస్తారా?
భలే వున్నవ్ రాహుల్…? గమ్మత్ మాట్లాడతావ్..
అవును దేశంలో నెంబర్ వన్‌గా ఉండాలనుకుంటాం.. తప్పేంది? ఉంటలేమా? అక్కడ కూడా మా పేరును తలుచుకోని వారున్నారా? మా సంక్షేమపథకాలను ఉద్దేశించి కీర్తించని వారున్నారా?
అందుకే ఒక్కసారి కాదు.. బరాబర్ వందసార్లంటం..
మేమే నెంబర్ వన్
మేమే నెంబర్ వన్
నేనే నెంబర్ వన్..
తెల్వక అడుగుతా. మధ్యలో మీకేం నొప్పి? అహ.. ఏం కడుపునొప్పి అని అడుగుతున్నా..?
ప్రజలంతా సుభిక్షంగా లేరంటావా? సంతోషంతో హాయిగా బతకడం లేదా?
లేకపోతే పాలాభిషేకాలు ఎందుకు చేస్తారు..?
కనీసం కామన్ సెన్స్ లేదు రాహుల్ నీకు?
స్టాలిన్ ఏదో పొగడొద్దు అని అంటే .. దాని అర్థం నీకు తెలుసా?
ఇంకా ఇంకా పొగడండని. రాజకీయాల్లో అర్థాలు వేరే ఉంటయ్ తెలుసా. ఈ పొగడ్తలు సరిపోలేదని ఆయన చెప్తున్నాడు.
మేం పొగిడితేనే కదా…. ఈడిదాకా వచ్చాం. వాళ్లూ రావొద్దా నాదాకా.
అయినా పొగడ్తలో ఉన్న కిక్కే వేరప్పా రాహుల్..
నీకు అది తెల్వదు. మా స్టాలిన్‌కు . నాకే తెలుసు. మా ఎమ్మెల్యేలకే తెలుసు.
మా మంత్రులకు మరీ మరీ తెలుసు…