(దండుగుల శ్రీనివాస్)
అసలు రాష్ట్రంలో ఏ సమస్యలేనట్టు.. ప్రభుత్వం ఏర్పడీ ఏర్పడగానే మూసీ వెంట పడటమేమిటో ఎవరికీ అర్థం కాని విషయం. కేసీఆర్‌ను కాదని, కాంగ్రెస్‌ను తెచ్చుకున్నారు జనాలు. రేవంత్ రెడ్డి కొత్తగా ఇంకేమైనా చేస్తాడేమోనని ఆశగా తెచ్చుకున్నారు. ఇచ్చిన హామీలు ఎప్పుడు వస్తాయా..? ఎప్పుడిస్తారా ? అని కూడా ఎదురుచూస్తున్నారు. కానీ హరీశ్‌రావు అన్నట్టుగా ఈ ప్రభుత్వం డెవలప్‌మెంట్ ఆక్టివిటీ నిర్మాణాలతో కాదు.. కూల్చివేతలతో మొదలైంది. ప్రభుత్వం ఏర్పడీ ఏర్పడగానే జనాలకు ఇమ్మిడియేట్‌గా కలిగిన ప్రయోజనం ఫ్రీ బస్సు. ఆ తరువాత ఉచిత కరెంటు రైతులకు రుణమాఫీ. ఇదింకా ఉంది. సంపూర్ణం కాలేదు. చేస్తామంటున్నారు.
కానీ యాబైశాతమైతే రైతులకు మేలు జరిగింది. ఇవి తప్ప ఇంకేం ఒరగలేదు. జరగలేదు. చేయాల్సింది చాలనే ఉంది. గత ప్రభుత్వం చేయనివి ఈ సర్కార్ చేసినవి ప్రధానంగా ఇవే. మరో ప్రధానమైన సంక్షేమ పథకాలు పించన్లు, రైతు బంధు. పింఛన్లు పాతవే కంటిన్యూ అవుతున్నాయి. కొత్త వారికి రాలేదు. నాలుగు వేలకు పెంచి ఇస్తామన్నవి ఇంకా ముందట పడలేదు. ఇక రైతుబంధు ఊసే లేదు. ఒక సీజన్ లాస్ అయిపోయాడు రైతు. ఈ విషయంలో కేసీఆర్‌ను యాదికి తెచ్చుకునే పరిస్థితులు క్రియేట్ చేసుకున్నది కాంగ్రెస్ సర్కార్. కేసీఆర్ పైసలు ఇంక రాలే.. అని ముచ్చట అంతటా వినిపిస్తున్న తరుణంలో.. ఇవన్నింటినీ వదిలి మూసీ వెంట పడ్డాడు రేవంత్. సరే అన్ని పనుల్లో భాగంగా దీన్ని అలా చేసుకుంటూ పోతే బాగుండు. కానీ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయని పంతం పట్టి మరీ దీని వెంట పరుగెత్తడం ఎందుకో…? ఇక ప్రతిపక్షాలు కూడా ఇంకా వేరే పనే లేదన్నట్టు.. అసలు ప్రజాక్షేత్రంలోకి పోవడమే మానేశారు. కేటీఆర్.. అయితే ప్రెస్‌మీట్ లేకపోతే ట్వీట్. ఇదే పని వీరిది.
హైదరాబాద్ కేంద్రంగానే మూసీమురికి రాజకీయాలు చేసుకుంటూ రెండు పార్టీలు గడుపుతున్నాయి తప్ప. గ్రామాల జోలికి పోవడం లేదు. హైడ్రా వద్దంటుంటే దానికి హై పవర్స్ అంటూ మరింత బలోపేతం చేస్తూ పోతున్నాడు రేవంత్. హైడ్రా, అక్రమ నిర్మాణాలు, మూసీ సుందరీకరణ.. ఇదే ఇప్పుడు గత నాలుగైదు నెలలుగా కొనసాగుతున్న తంతు. ప్రభుత్వం ఏర్పడీ ఇంకా ఏడాది కాకముందే ఇంతటి వివాదస్పద విషయాలు నెత్తికెత్తుకుని ఎందుకు ఇలా చేస్తున్నాడు రేవంత్ అనేదే ఇప్పుడు జనాల నుంచి వస్తున్న ఆగ్రహం. దీనికి ప్రతిపక్షం కూడా తోడైంది. మరీ టూ మచ్‌గానే స్పందిస్తోంది. ఈ విషయంపై స్పందించినట్టుగా ఇతర సంక్షేమపథకాలు, హామీల అమలుపై స్పందిస్తే బాగుండంటున్నారు జనాలు. ఈ ఇద్దరూ క లిసి జనం గోడు పట్టించుకోవడం మానేసి .. వారి అవసరాలు, రాజకీయాలకే ప్రయార్టీ ఇస్తూ పోతున్నారు. రచ్చ రాజకీయాలకు హైదరాబాద్‌ను కేంద్ర బిందువుగా మారుస్తున్నారు.