వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్:
హైడ్రా కూల్చివేతలు ఆగవన్నాడు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని ఇండ్లను కూడా తొలగించే తీరుతామన్నాడు. మీడియాలో ఆక్రమణలు కూల్చివేతలపై ప్రభుత్వం వెనుకడుగు వేసిందని వార్త కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆయనతో వాస్తవం ప్రతినిధి వివరణ తీసుకున్నారు. దీనిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
హైడ్రా పై ప్రజల మద్దతు ఉందన్నారు. చెరువులను సంరక్షించే బాధ్యతను ప్రభుత్వం భుజానేసుకున్నదని, దీనిపై అన్ని వర్గాల మద్దతు లభిస్తున్నదని తెలిపారు. దీంతో పాటు మూసీ సుందరీకరణను కూడా ప్రభుత్వం ఓ బాధ్యతగా తీసుకుంటున్నదని వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వెనుకాడబోమని, వారికి పునరావసం కల్పించి మూసీ వద్ద ఉన్ని ఇండ్లను తొలగిస్తామన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని వచ్చిన వార్తలు కేవలం సోషల్ మీడియా సృష్టే అన్నారు.