Tag: brs

ఫ్రీ బ‌స్సు.. స‌న్న‌బియ్యం… రేష‌న్‌కార్డులు..! జ‌నం నాడీ ప‌థ‌కాలు.. ప్ర‌భుత్వానికి మైలేజీ తెచ్చే కాంగ్రెస్ మార్కు ప‌థ‌కాలివే..! మిగిలినవన్నీ కేసీఆర్ మార్కు ప‌థ‌కాలే..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నో హామీలిచ్చి గ‌ద్దెనెక్కిన స‌ర్కార్‌కు అవి అమ‌లు చేయ‌డం అంత వీజీ కాద‌ని తెలిసిపోయింది. బ‌డ్జెట్ త‌ల‌కిందులుగా ఉన్న విష‌యం అధికారంలోకి వ‌స్తేగానీ తెలియ‌దు. కొత్త ప‌థ‌కాలు, హామీల మాట దేవుడెరుగు.. పాత‌వి కొన‌సాగించ‌డానికే త‌ల్ల‌డ‌మ‌ల్ల‌డ‌మ‌వుతోంది రేవంత్ స‌ర్కార్‌.…

అచ్చిరాని ఛాలెంజ్‌లు..! మైలేజీ ఇవ్వ‌ని, క‌లిసిరాని స‌వాళ్లు.. !! రైతుల విష‌యంలో బీఆరెస్‌ను టార్గెట్ చేయ‌లేక‌పోతున్న కాంగ్రెస్‌.. స‌వాళ్లు రేవంతు వంతు.. ఫ‌లాలు బీఆరెస్ వైపు..

(దండుగుల శ్రీ‌నివాస్) ప్ర‌తిప‌క్ష‌లంలో ఉన్న‌ప్పుడు ఒక లెక్క‌.. ఇప్పుడొక‌లెక్క‌. అప్పుడు జ‌నం విన్నారు. ఇప్పుడు చూస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా అల‌వికాని హామీలు. ఇప్పుడు అమ‌లు చేయ‌లేని ప‌రిస్థితి. అధికారంలోకి వ‌చ్చినంక ఛాలెంజులు. స‌వాళ్లు. ఇప్పుడీ స‌వాళ్లు, ఛాలెంజులు రేవంత్‌కు అచ్చిరావ‌డం…

మందిని ప‌ట్టించుకోకుండా.. వంద వందంటుండ్రు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎన్నిక‌ల‌కింకా చాలా రోజులే ఉంది. ఇప్పుడే ఎన్నిక‌ల‌లో. అన్ని పార్టీల‌కు. మాకు వందంటే. మాకు వందంటుండ్రు. మంది ఆగ‌మ‌తైంటే రాజ‌కీయాలే ముఖ్య‌మ‌య్యాయి వీళ్ల‌కు. ఇది మొదాలు షురూ చేసింది రేవంతు. చేసింది గోరంత కూడా లేదు. చేయాల్సింది కొండంతుంది.…

రేవంత్ విగ్ర‌హ పాట్లు..! బీఆరెస్ ఆగ్ర‌హ పోట్లు..!! వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా విగ్ర‌హాల ఏర్పాటు.. తెలంగాణ త‌ల్లి, రాజీవ్‌గాంధీ విగ్ర‌హాల ఏర్పాటు పై ఇప్ప‌టికే కేటీఆర్ వార్నింగ్‌.. బీఆరెస్ ఆగ్ర‌హం.. తాజాగా రోశ‌య్య విగ్ర‌హ ఏర్పాటుపై దుమారం.. ఆంధ్రోళ్ల విగ్ర‌హాలు, పేర్లు వ‌ద్ద‌నే క‌దా పోరాటం చేసింది.. మ‌ళ్లీ ఇదేందీ..? మండిప‌డుతున్న టీసోష‌ల్ మీడియా ఫోరం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ కోసం కొట్లాట‌లో విగ్ర‌హాల అంశం కూడా కీల‌క‌మైన‌దే. ఆంధ్రోళ్ల పేర్లు, ఆ విగ్ర‌హాలు మాకొద్ద‌నే క‌దా అప్పుడు పోరాడింది. మిలియ‌న్ మార్చి పోరాటంలో ట్యాంక్‌బండ్‌పై విగ్ర‌హాల ధ్వంసాలు కూడా తెలంగాణ ప్ర‌జాగ్ర‌హానికి, ధ‌ర్మ‌పోరాటానికి ఓ నిద‌ర్శ‌నం. ఇప్పుడు…

అక్క‌కు మేలు చేస్తున్న కేసీఆర్ ద‌య్యాలు..! అన్న చేయాల్సిన‌వి అక్క చేస్తోంది..! రాష్ట్ర నేత‌గా ఎదిగేందుకు ఉప‌యోగ‌ప‌డుతున్న వేరుకుంప‌టి..! స‌మ‌కాలీన ప‌రిస్థితులపై స‌త్వ‌రం స్పందిస్తున్న క‌విత‌.. బీఆరెస్ చేయ‌లేని ప‌నుల‌ను త‌ను చేసి చూపుతున్న వైనం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ ద‌య్యాలు క‌విత‌కు మంచే చేస్తున్నాయి. ద‌య్యాలంటే అందులో కీల‌క‌మైన ద‌య్యం.. అక్క వేరు కుంప‌టి పెట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన ద‌య్యం కేటీఆరేన‌ని ప్ర‌త్యేకంగా మ‌ళ్లీ చెప్ప‌న‌వ‌స‌రం లేద‌నుకుంటా. కేసీఆర్ దేవుడే కానీ .. కేసీఆర్ చుట్టూ ద‌య్యాలున్నాయి..…

కేసీఆర్ బీసీల అన్వేష‌ణ‌..! అప్పుడు బీసీలు గుర్తు రాలేదు.. ఇప్పుడు త‌ప్పేలా లేదు..! ఇంచార్జిలను తొల‌గించి.. బీసీల‌కు బాధ్య‌త‌లిచ్చి.. మున్నూరుకాపు, గౌడ్‌, ప‌ద్మ‌శాలి, యాద‌వుల లిస్టు తెప్పించుకున్న కేసీఆర్…

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ దిగొచ్చిండు. త‌ల‌కెక్కిన అహంకారం దిగుతున్న‌ది. ప‌క్కా ఓటు బ్యాంకు రాజ‌కీయాలు నెరిపే అల‌వాటు దోర‌ణి నుంచి రూటు మార్చాడు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెలకొన్నబీసీ కాన్సెప్టు ప్ర‌కారం త‌నూ పోవాల్సిందేన‌ని తేల్చుకున్నాడు. ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్టు… తను అధికారం…

జీవ‌న్‌రెడ్డి అరాచ‌కాల‌పై కేసీఆర్ ఫోక‌స్‌..! ఆ పార్టీలో తాజామాజీపై తీవ్ర వ్య‌తిరేక‌త‌.. అధినేత దృష్టికి వ‌చ్చిన అరాచ‌క, విధ్వంసాల లిస్టు… !

(దండుగుల శ్రీ‌నివాస్‌) చేసిన త‌ప్పులు దిద్దుకునే ప‌నిలో ఉన్నాడు కేసీఆర్‌. త‌న‌ను చూసి ఓటేస్తారు.. క్యాండిడేట్‌ను చూడ‌ర‌నే భ్ర‌మ‌లోంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అందుకే అప్పుడు ఇచ్చిన వారికే వ‌రుస‌గా మూడు సార్లు చాన్స్ ఇచ్చి ఘోరంగా దెబ్బ‌తిన్నాడు. సిట్టింగుల అరాచ‌కాలు అంతా ఇంతా…

మోడీ ఏం చేసినా .. దేశం కోసం ధ‌ర్మం కోసం..! కేసీఆర్ ఏం చేసినా.. తెలంగాణ కోసం మ‌న కోసం… అంతే..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్‌కు ఓ బ్రాండ్ ఉంది. తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరిలూదాడానే క్రెడిబిలిటీ ఉంది. తెలంగాణ రావ‌డంలో ఆయ‌నది కీల‌క పాత్ర‌నే గుర్తింపు ఉంది. చ‌రిత్ర‌లో అది ఉండిపోతుంది. ఇందులో డౌట్ లేదు. జ‌య‌శంక‌ర్ సార్ కూడా చాలా సార్లే చెప్పాడు.…

అగ్గిపుల్ల, కుక్క‌పిల్ల, స‌బ్బుబిళ్ల … కాదేదీ ఫోన్‌ట్యాపింగ్‌క‌న‌ర్హం…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అందులో అనుమానం లేదు. అది ఉద్య‌మ‌కాల‌మైనా.. సీఎంగా ప‌రిపాల‌నైనా. బాగా ద‌గ్గ‌ర‌గా చూసిన కొద్ది మందికి మాత్ర‌మే తెలుసు ఆయన మేక‌పోతు గాంభీర్యం. చాలా పిరికి. భ‌యం. పైసా పిచ్చి లేదు గానీ…

లోక‌ల్ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌..! ఇంట గెలిచేందుకు తండ్లాట‌..! నియోజ‌క‌వ‌ర్గాల‌న్నీ చుట్టి వ‌స్తున్న క‌విత‌..! నిజామాబాద్‌లో త‌న టీమ్ ఏర్పాటులో బిజీబిజీ..

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌ ర‌చ్చ గెలిచేందుకు ర‌చ్చ ర‌చ్చ చేసిన క‌విత‌.. ఇప్పుడు ఇంట గెలిచేందుకు తండ్లాడుతోంది. నిజామాబాద్ జిల్లాలో త‌న ఉనికినే లేకుండా చేసిన త‌న సొంత పార్టీ నేత‌ల‌తో ఆమె త‌ల‌ప‌డుతోంది. వారి బాధితులనంద‌రినీ ఏకం చేసి…