Tag: #bcreservations

బీసీల మ‌న‌సు గెలుచుకున్న స‌ర్కార్‌! 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమలుతో మార‌నున్న రాజ‌కీయం..! బీసీల రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు ఊత‌క‌ర్ర‌గా నిలిచిన రేవంత్ స‌ర్కార్‌.. బీసీల వ‌ద్ద న‌మ్మ‌కం, విశ్వాసం కోల్పోయిన బీఆరెస్‌, బీజేపీలు.. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో ఇక 42 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లుకు స‌ర్కార్ ప్ర‌త్యేక జీవో..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: ఎన్నిక‌లు రాగానే బీసీల‌పై ఎన‌లేని ప్రేమ కురిపిస్తాయి అన్ని పార్టీలు. రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో మాత్రం ఎవ‌రూ ముంద‌డుగు వేయ‌లేదు. సాహించ‌లేదు. ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో.. ప‌దేళ్ల పాల‌న‌లో ఉన్న రిజ‌ర్వేష‌న్లు మింగి కూర్చుకున్నారు. అంతా…

మాదిగ‌లో మాదిగ‌నై… గౌండ్ల‌లో గౌడ్‌నై… ముదిరాజుల‌లో రాజునై..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్‌రెడ్డిని నేను రేవంత్ గౌడ్ అని పిలుస్తున్నా ఈ వేదిక‌గా. ఎందుకంటే ఆయ‌న గౌడ్ల అభివృద్ధికి చేస్తున్న కృషి ఎన‌లేనిది. గౌడ కుల‌స్తుల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా, వారి ఆలోచ‌న‌ల‌ను గ్ర‌హించిన‌వాడిగా సంక్షేమ పెన్న‌ధిగా చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను చూసీ నేను…

జ‌పం జ‌పం జ‌పం.. బీసీ జ‌పం! అన్ని పార్టీల బీసీ రాగం బీసీ జ‌నం ఎవ‌రిని న‌మ్ముతున్నారు? ఎవ‌రి వెనుక నిలుస్తున్నారు??

(దండుగుల శ్రీ‌నివాస్‌) పార్టీల‌కు బీసీ రాగం అందుకోవ‌డం కొత్తేమీ కాదు. అవ‌స‌ర‌మొచ్చిన‌ప్పుడు, ఎన్నిక‌ల‌ప్పుడు, రాజ‌కీయ ల‌బ్ది కోసం.. ద‌శాబ్దాలుగా వ‌స్తున్న ప‌ద‌మే ఇదీ. నినాద‌మే ఇదీ. ఇప్పుడు ఇది పీక్‌కు చేరింది. తాడోపేడో తేల్చుకునేందుకు బ‌రి గీసి నిలిచింది. దీనికి కాంగ్రెస్…

రేవంతు బ‌ల‌వంతు..! తిరుగులేదు.. ఎదురులేదు..!! రాహుల్ ప్ర‌శంస‌ల‌తో అనుమానాలు ప‌టాపంచ‌లు కుల‌గ‌ణ‌న స‌ర్వేతో అధిష్టానం మ‌న‌సు దోచిన సీఎం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ప్ర‌తిప‌క్షానికి అదో అస్త్రం నిన్న‌టిదాకా. పాల‌న ప‌రంగా, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు ప‌రంగానో విమ‌ర్శ కాద‌ది. ఢిల్లీలో రాహుల్‌గాంధీ సీఎంకు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌నేది. ఎన్నిసార్లు వెళ్లినా క‌ల‌వ‌డం లేదు.. క‌నీసం ప‌ల‌క‌రించ‌డ లేదు.. అంటూ త‌మ రాజ‌కీయ…

బీఆర్ఎస్ బీసీవాదం…అపహాస్యం…! దిద్దుకోలేని పొర‌పాటు.. బీసీల మ‌ద్ద‌తు కోసం తండ్లాట‌… బీఆరెస్ దిద్దుబాటు పాకులాట‌.. హ‌డావుడి మ‌హాధ‌ర్నాపిలుపు.. పార్టీ గొడుగు కింద చేయలేని దుస్థితి..

(దండుగుల శ్రీ‌నివాస్) బీఆరెస్ నెత్తికెత్తుకోవ‌డానికి చేస్తున్న బీసీవాదం ప్ర‌య‌త్నం అప‌హాస్యం పాల‌వుతున్న‌ది. తొమ్మిదిన్న‌ర సంవ‌త్స‌రాల‌లో ఏ రోజూ కూడా.. శాస‌న‌స‌భ‌లో కానీ పార్టీలో గానీ చ‌ర్చ‌కు రాకుండా అడ్డుకున్న నాటి బీఆరెస్ స‌ర్కార్‌.. నేడు కాంగ్రెస్‌ను చూసుకుని వాత పెట్టుకోవాల‌ని చేసే…

బీఆరెస్‌కు చెంప‌పెట్టు…! కాంగ్రెస్‌కు చారిత్రాత్మ‌కం..!! 42 శాతం బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న కేబినెట్.. విద్యా, ఉపాధి, రాజ‌కీయాలకు అమ‌లు చేసేందుకు స‌ర్కార్ రెడీ..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఫ‌క్తు రాజ‌కీయాల‌కు బీసీలు బ‌ల‌య్యారు. అధికారమే ప‌ర‌మావ‌ధిగా.. బీసీలు, అణ‌గారిన వ‌ర్గాల‌కు తీవ్ర న‌ష్టం చేసేలా గ‌త పాల‌న కొన‌సాగింది. కేసీఆర్ నియంత పాల‌న‌లో ఇదీ ఓ విధ్వంసం. జ‌నాభా ప్రాతిప‌దిక‌న సీట్లివ్వ‌లే, రిజ‌ర్వేష‌న్లు అస‌లే అమ‌లు చేయ‌లే.…

పాముకు పాలుపోసి పెంచాం…! కుల గణ‌న‌పై తీన్మార్ మ‌ల్ల‌న్న పైత్య‌పు మాట‌ల‌పై అధిష్టానం భ‌గ్గు..! క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల‌కు సిద్దం.. మొద‌ట షోకాజ్ నోటీస్‌..!! మ‌ల‌న్న వెనుక బీఆరెస్‌.. కుట్ర‌లో భాగంగానే ఇదంతా…! భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. చాప‌ర్‌ను స‌మ‌కూర్చింది కూడా కేటీఆరే.. ! పార్టీ అధినాయ‌క‌త్వం వ‌ద్ద తీన్మార్ మ‌ల్ల‌న్న చిట్టా..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) పాముకు పాలు పోసి పెంచామంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ స‌పోర్టు లేకుండానే తీన్మార్ మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీగా గెలిచాడా..? అని నిల‌దీస్తున్నారు. కాంగ్రెస్ స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న కుల గ‌ణ‌న‌పై పైత్య‌పు మాట‌లు మాట్లాడ‌టంపై భ‌గ్గుమంటున్నారు. ఏకంగా ఇది…